Foot care:చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Healthy lifestyle : చెప్పులు లేకుండా నడిచేవారు ఈ తరంలో ఎవరు ఉండరేమో. ఇంట్లో కూడా ఇప్పుడు చెప్పులు వేసుకునే నడుస్తూ ఉన్నారు చాలా మంది. అయితే చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. చూద్దాం..
Walking barefoot: మనలో చాలామందికి చెప్పులు లేకుండా నడవాలంటే ఎంతో ఇబ్బంది. బయటకే కాదు ఇంట్లో కూడా నడవడానికి చెప్పులు వాడుతారు. నడక ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది కానీ చెప్పులు, షూస్ ఏమి వేసుకోకుండా వట్టి కాళ్లతో నడిస్తే ఇంకా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే కాదు బయట వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో వట్టికాళ్లతో నడవడం అలవాటు చేసుకోవాలి.
ఇలా చెప్పులు లేకుండా నడిచే పద్ధతిని గ్రౌండింగ్ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల భూమిలో ఉన్న పాజిటివ్ శక్తి మన శరీరంతో కనెక్ట్ అవుతుంది. మన చక్రాలు ఉత్తేజితమవడమే కాకుండా మనలో కొత్త శక్తి ప్రవహించిన భావన కలుగుతుంది. కాలిలో శరీరానికి సంబంధించిన ఎన్నో నరాల కలయిక ఉంటుంది. ఇలా చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ నరాల మీద పడ్డ ఒత్తిడి కారణంగా శరీరంలో రక్తప్రసరణ చురుకుగా జరుగుతుంది. ఇలా నడవడం గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
దృఢమైన కండరాలు :
చెప్పులు లేకుండా నడవడం వల్ల మన పాదాల కండరాలు బాగా బలంగా.. దృఢంగా తయారవుతాయి.
తరచూ కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు ఎక్కడం లాంటి సమస్యలతో బాధపడేవారు ఇలా చెప్పులు లేకుండా నడవడం వల్ల ఉపశమనం పొందుతారు.
ఒత్తిడి :
గ్రౌండింగ్ వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు మానసిక ఆందోళన, నిద్రలేమి లాంటి పలు రకాల సమస్యలు దూరం అవుతాయి. ఎక్కువ ఒత్తిడి అనుభూతి చెందే వారు పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే ఎంతో మంచిది.
ప్రికాషన్స్:
పాదాలకు ఎటువంటి రక్షణ లేకుండా నడిచే క్రమంలో దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది .కాబట్టి నడిచే పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు పది నిమిషాలు ఇలా చెప్పులు లేకుండా నడక ప్రాక్టీస్ చేయడం వల్ల మెల్లిగా ఇది మీకు అలవాటు అవుతుంది. కొన్ని సందర్భాలలో మనం నడిచే ప్రదేశం లో విరిగిన గాజు ముక్కలు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది . అందుకే ఇలా చెప్పులు లేకుండా నడిచే ప్రదేశం మనకు తెలిసినది శుభ్రమైనది అయి ఉండాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచన మేరకు సేకరించడం జరిగింది కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.l
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook