COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dry Fruits Laddu Recipe In Telugu: చిన్నపిల్లలు అప్పుడప్పుడు లడ్డూలను ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అయితే చాలామంది స్వీట్ షాపుల్లో లభించే ఎక్కువ చక్కెర కలిగిన లడ్డూలను ఇస్తూ ఉంటారు. నిజానికి వీటిని పిల్లలకు అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లడ్డులకు బదులుగా ఇంట్లోనే అన్ని డ్రై ఫ్రూట్స్ తో కలిపి లడ్డూలను తయారు చేసుకొని, పిల్లలకు ఇస్తే అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు లడ్డు రూపంలో పిల్లలకు అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి డ్రై ఫ్రూట్స్ తో చేసిన లడ్డులు మార్కెట్లో కూడా లభిస్తుంది. అయితే వీటిని పిల్లలకి ఇవ్వడం అంత సేఫ్ కాదు. కాబట్టి ఇంట్లోనే సులభంగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో లడ్డును తయారుచేసి ఇవ్వడం ఎంతో మేలు. అయితే మీరు కూడా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభమైన పద్ధతిని పాటించి ఇంట్లోనే తయారు చేసుకోండి.


డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు: 


1 కప్పు డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, వేరుశెనగ, పిస్తా, యాలకులు)
1/2 కప్పు నెయ్యి
ఒక కప్పు ఖర్జూర పండ్లు
1/2 కప్పు పంచదార (అవసరమైతే)
ఒక టీ స్పూన్ యాలకుల పొడి
1/4 కప్పు శనగపిండి (అవసరమైతే)


తయారీ విధానం:
ముందుగా డ్రై ఫ్రూట్స్ లడ్డూను తయారు చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. 
ఈ ప్లేట్ లో డ్రై ఫ్రూట్స్ను అన్నిటినీ వేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాల్సి ఉంటుంది. ఇలా కోసుకున్న డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టుకోవాలి. 
ఆ తర్వాత స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ను వేయించడానికి తగినంత నెయ్యిని వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ పై బాగా వేయించుకోవాలి. 
డ్రై ఫ్రూట్స్ అన్ని గోధుమ రంగులోకి మారిన తర్వాత వాటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 
ఆ తరువాత స్టవ్ పై ఉన్న బౌల్ లోనే గింజలు తీసిన ఖర్జూరాను వేసి బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోనే డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 
ఇలా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో తగినంత తేనె కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ ముద్దలు కట్టుకోవాల్సి ఉంటుంది. 
అంతే సులభంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైనట్లే..


చిట్కాలు:
ఈ లడ్డు తయారు చేసుకోవడానికి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వినియోగించవచ్చు. 
అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి ఖర్జూరాకు బదులుగా చక్కెరను కూడా వినియోగించవచ్చు. 
ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మరింత రుచిగా ఉండడానికి ఏలకుల పొడిని ఎక్కువగా వినియోగించుకోవచ్చు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రయోజనాలు:
డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రతిరోజు తినడం వల్ల పిల్లల శక్తి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
డ్రై ఫ్రూట్స్ లడ్డులో శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఫైబర్ ఐరన్ క్యాల్షియం అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల శరీరం దృఢంగా అవుతుంది. 
డ్రై ఫ్రూట్స్ లడ్డు లో ఉండే కొన్ని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. 
ప్రతిరోజు ఈ లడ్డును తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడడమే కాకుండా పుట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. 
ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను పిల్లలకు ప్రతిరోజూ ఇవ్వడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీనికి కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి