Dunki vs Salaar: ప్రస్తుతం రాబోతున్న పాన్ ఇండియా చిత్రాలలో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాలు షారుక్ ఖాన్ డంకి అలానే ప్రభాస్ సలార్. బాహుబలి తరువాత ప్రభాస్ కు ఎన్ని ఫ్లాపులు వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన చేస్తున్న సలార్ సినిమా అని కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోపక్క బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన 'డంకి' చిత్రం పైన కూడా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా షారుక్ బ్లాక్ బస్టర్ చిత్రం జవాన్ తర్వాత వస్తూ ఉండడంతో ఈ చిత్రం పైన ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.


ఇలా ఈ రెండు సినిమాలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడంతో ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో విడుదల కావు అనుకున్నారు చాలామంది. ఎందుకంటే రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలే. రెండు ఒకే సమయంలో విడుదల అయితే ఆ ప్రభావం రెండు సినిమాల పైన పడతాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమా కోసం షారుక్ వెనక్కి తగ్గుతాడని ఆయన 'డంకి' సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు షారుక్ వెనక్కి తగ్గే అవకాశం లేదు అని తెలుస్తోంది.


ఇక ఇదే విషయాన్ని తరణ్ ఆదర్శ్ కన్ఫామ్ చేస్తూ షారుక్ సినిమా ముందుగా చెప్పినట్టే  2023 క్రిస్మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానుందని ఎలాంటి ఆలస్యం జరగదని స్పష్టం చేశారు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన X ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారని తెలియజేశారు.


మరోపక్క 2023 క్రిస్మస్ కి ఆల్రెడీ ప్రభాస్ సలార్ వస్తుందని ఆ సినిమా మేకర్స్ కొద్ది రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు. కాబట్టి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మేకర్స్ కూడా తగ్గేలా కనిపించడం లేదు. మరి విడుదల అయ్యాక ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి.


ఇక ఈ రెండు సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తుండగా, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న 'డంకి' సినిమాలో తాప్సీ పన్ను కూడా హీరోయిన్ గా నటిస్తోంది.


Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి