Eating Corn In Monsoon: వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే.. శరీరానికి ఎన్ని ప్రయోజాలున్నాయో తెలుసా..!
Eating Corn In Monsoon: వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే ఆ మజానే వేరు..! ఇది తినడానికి రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ మొదలైనవి ఉంటాయి.Eating Corn In Monsoon: వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే.. శరీరానికి ఎన్ని ప్రయోజాలున్నాయో తెలుసా..!
Eating Corn In Monsoon: వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న తింటే ఆ మజానే వేరు..! ఇది తినడానికి రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా దోహదపడుతుంది. మొక్కజొన్నలో ఫైబర్, విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ మొదలైనవి ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తనడం వల్ల శరీరం ధృఢంగా మారుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే దీనిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణ వ్యవస్థ:
వర్షాకాలంలో మొక్కజొన్న తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మొక్కజొన్నలో అధిక పరిమాణంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో కడుపునొప్పి, అజీర్ణ సమస్య, గ్యాస్ వంటివి రావని నిపునులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా దగ్గు సమస్యలు కూడా తొలగిపోతాయని నిపుణులు పేర్కొన్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
వర్షాకాలంలో వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. కావున వానా కాలంలో మొక్కజొన్నను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది:
వర్షాకాలంలో చర్మంలో దద్దుర్లు సమస్యలు ఉత్పన్నమవం సహజం. అయితే ఈ క్రమంలో మొక్కజొన్నలను తినాలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. మొక్కజొన్నలో యాంటీ-ఆక్సిడెంట్లు ఉండడం వల్ల చర్మాన్ని రిపేర్ చేయడానికి ప్రభావవంతగా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వర్షాకాలంలో మొక్కజొన్న ఈ రెసిపీలను తప్పకుండా తినండి:
మొక్కజొన్న సూప్ రెసిపీ:
వర్షాకాలంలో మొక్కజొన్నను సూప్ లాగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొక్కజొన్న సూప్ చేయడానికి.. ముందుగా మొక్కజొన్న గింజలు, రెండు కప్పుల నీరు, కొంచెం ఉప్పును కుక్కర్‌లో కలపండి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మొక్కజొన్న గింజలను గ్రైండ్ చేయాలి. ఆ తర్వత దీనిపై పచ్చి కొత్తిమీర, ఎండుమిర్చి వేసి కలపాలి. వేడి వేడిగా తీసుకుంటే.. శరీరానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
కార్న్ శాండ్‌విచ్ రిసిపి:
మొక్కజొన్న శాండ్‌విచ్ కూడా చేయవచ్చు. దీని కోసం ఉడికించిన మొక్కజొన్న గింజలు, ఇతర కూరగాయలను ఉడికించి. శాండ్‌విచ్‌లా కాల్చి తినండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Boris Johnson: అక్కడ డొనాల్ట్ ట్రంప్.. ఇక్కడ బోరిస్ జాన్సన్! పిచ్చి పనులే కొంప ముంచాయా?
Also Read: Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook