Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని నెగటివిటీ చుట్టుముడుతుంది. చేపట్టిన ప్రతీ పనికి ఆటంకాలు ఎదురవుతాయి. అసహనం పెరిగిపోతుంది. రోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 06:36 AM IST
  • మూడు రాశుల వారిపై ఇవాళ నెగటివిటీ ప్రభావం
  • చేపట్టిన పనుల్లో ఆటంకాలు, సమస్యలు
  • మిగతా రాశుల వారికి పాజిటివిటీ నెలకొంటుంది
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే...
Horoscope Today July 8th: నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారిని ఇవాళ నెగటివిటీ వెంటాడుతుంది

Horoscope Today July 8th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని నెగటివిటీ చుట్టుముడుతుంది. చేపట్టిన ప్రతీ పనికి ఆటంకాలు ఎదురవుతాయి. అసహనం పెరిగిపోతుంది. రోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

మేష రాశి (Aries)

చంద్రుడి అనుగ్రహం కలిసొస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. లక్ష్యం వైపు ఫోకస్ పెరుగుతుంది. చేపట్టిన పనిలో మీ పెర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. మీ బాస్ మిమ్మల్ని అభినందించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, కీలక బాధ్యతలు మీకు అప్పగించవచ్చు. చట్టపరమైన విషయాల్లో మీకు గుడ్ న్యూస్ అందుతుంది. ప్రత్యర్థులను మీరు నియంత్రించగలరు.

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీ మేదోశక్తి అద్భుతంగా ఉంటుంది. కోపాన్ని అణుచుకోవడం అలవాటు అవుతుంది. కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా కొన్ని టాస్క్‌లను స్మూత్‌గా పూర్తి చేయగలరు. ఆర్థిక పురోగతి కూడా బాగుంటుంది. ఉద్యోగ జీవితం, చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టేముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రియురాలు లేదా ప్రియుడి కోసం డబ్బు ఖర్చు చేస్తారు.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీపై చంద్రుడి నెగటివ్ ప్రభావం ఉంటుంది. మీ చుట్టూ నెగటివిటీ వ్యాపిస్తుంది. చేపట్టిన బాధ్యతలు భారంగా భావిస్తారు. ఇచ్చిన పనిని పూర్తి చేయడంలో హడావుడి పడుతారు. ఈ క్రమంలో కొన్ని తప్పులు దొర్లుతాయి. మీ పని సామర్థ్యం తగ్గుతుంది. అది మీ రోజువారీ పనిపై ప్రభావం చూపుతుంది. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులన్నీ వాయిదా పడుతాయి. కీలక విషయాల్లో నిర్ణయాలకు ముందు మీరు బాగా నమ్మే వ్యక్తి నుంచి సలహా కోరండి.

కర్కాటక రాశి (Cancer) 

చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. తోబుట్టువు నుంచి శుభవార్త వింటారు. కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంటికి సృజనాత్మకంగా మరమత్తులు చేపడుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి భాగస్వామ్యంతో వ్యాపారం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. ఇది మీకు లాభాలు తీసుకొస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం.

సింహ రాశి (LEO)

ఇవాళంతా మిమ్మల్ని నెగటివిటీ వెంటాడుతుంది. చేపట్టిన పనులు పూర్తి కావు. మీ సహనం చాలాసార్లు పరీక్షించబడుతుంది. చిన్న చిన్న తప్పిదాలు మిమ్మల్ని మరింత గందరగోళపరుస్తాయి. తద్వారా పనులు మరింత ఆలస్యమవుతాయి. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను తామే సరిగా అర్థం చేసుకోలేని గందరగోళంలో పడిపోతారు. వివాహితులు అతిగా ఆశించడం వల్ల జీవిత భాగస్వామితో ఎమోషనల్ అటాచ్‌మెంట్‌పై ప్రభావం పడుతుంది.

కన్య రాశి (Virgo)

చంద్రుడి అనుగ్రహం మీకు పాజిటివిటీ ఇస్తుంది. మనశ్శాంతి, సంతోషం చేకూరుతుంది. వృత్తిరీత్యా సమర్థతతో పనిచేస్తారు. ఉద్యోగంలో మీ సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు తోబుట్టువు భాగస్వామ్యంతో కొత్త వెంచర్ ప్రారంభిస్తారు. అది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ఎప్పుడూ మీరు ఎనర్జిటిక్‌గా ఉండాలంటే తగిన విశ్రాంతి కూడా అవసరమని గుర్తించండి.

తులా రాశి (Libra)

చంద్రుడి నెగటివిటీ మీపై పడుతుంది. బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటారు. అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెడుతారు. ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచాలి. లేనిపక్షంలో కుట్రలు, కుతంత్రాలకు మీరు బాధితులుగా మిగులుతారు. ఏవైనా డాక్యుమెంట్స్‌పై సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

వృశ్చిక రాశి (Scorpio)

చంద్ర అనుగ్రహం సంతోషాన్ని తీసుకొస్తుంది. కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతోషకరంగా ఉంటుంది. ఎప్పుడు ఇతరులతో మాట్లాడినా వారికి తగిన గౌరవమిస్తారు. తద్వారా ఎదుటివారిలో మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీ సేవింగ్స్ పెరుగుతాయి. ఇంటి మరమత్తులు చేపట్టే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

పనిలో మీ హార్డ్ వర్క్‌కి తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. పనిభారం కారణంగా మానసికంగా అలసిపోతారు. పని భారం కారణంగా ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా హాజరుకాలేరు. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు వారి ఆరోగ్యం కుదుటపడుతుంది.

మకర రాశి (Capricorn) 

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ఉద్యోగపరంగా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులు కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. మీ పెద్దలు మీకు అన్నింటా సరైన మార్గాన్ని సూచిస్తారు. అది మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఉపయోగపడుతుంది.

కుంభ రాశి (Aquarius)

ఇవాళంతా నీరసంగా గడుస్తుంది. మీ మైండ్‌ని కూల్‌గా ఉంచుకోండి. అనవసర విషయాలపై ఆలోచనలతో బుర్ర పాడుచేసుకోవద్దు. ఓపిక అవసరం. అహంకారపూరిత ధోరణి పనికిరాదు. మీకు రావాల్సిన పాత బకాయిలు ఇంకా వసూలు కావు. అడ్వెంచర్ టూర్స్‌కి ఇది ప్రతికూల సమయం. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

మీన రాశి (Pisces) 

చంద్ర అనుగ్రహంతో సంతోషం నెలకొంటుంది. కొంతమంది వ్యక్తులతో పరిచయం మీపై ప్రభావం చూపుతుంది. వారి సలహాలు వర్క్ విషయంలో మీకు చాలా పనికొస్తాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తులపై నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Salman Khan Lawyer: సల్మాన్ ఖాన్ లాయర్ ను లేపేస్తామంటూ గ్యాంగస్టర్ లేఖ!

Also Read: Suchendra prasad: మైసూర్ ఘటన తర్వాత భర్తకు పవిత్ర లోకేష్ ఫోన్!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News