Passion Fruit: ఎముకలను దృఢంగా ఉంచడంలో ఈ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది..
Passion Fruit Benefits: ప్యాషన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని తెలుగు భాషలో కృష్టఫలం అని పిలుస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Passion Fruit Benefits: ప్యాషన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ప్యాషన్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ అధికంగా దొరుకుతుంది. మలబద్దం సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఫ్రూట్‌ను తినడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్యాషన్ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని మీ ఆహారం చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పాషన్‌ఫ్రూట్‌లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టవచ్చు. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని కారణంగా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాం. నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్యాషన్ ఫ్రూట్ సహాయపడుతుంది. ఇందులోని కార్డియాక్ అటానమిక్ నాడీని మెరుగుపరుచుతుంది.ఆస్కార్బిక్ యాసిడ్ పారాసింపథెటిక్ నాడీ పనితీరును సరిగా జరిగేలా సహాయపడుతుంది.
ఇందులోని మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ , ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒత్తిడి, ఆందోళన సమస్యతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల సమస్య నుంచి కోలుకుంటారు. విటమిన్ ఎ,సి చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది. చర్మ సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. అంతేకాకుండా క్యాటరాక్ట్, మాక్యులార్ సమస్యను నివారిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ ఏ, సీ యాంటీఆక్సిడెంట్ ప్రభావం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది.
ప్యాషన్ ఫ్రూట్ వల్ల కండరాలు ధృడంగా తయారు అవుతాయి. శరీర గాయాలు, మంట, అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.
కండరాలు, రక్తనాడులకు మంచిది. మంట, గాయాలు, అలసటల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఊపిరితిత్తులు బలోపేతమౌతాయి. శ్వాస సమస్యలు తొలగుతాయి. అయితే ప్యాషన్ ఫ్రూట్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్రాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter