Hair Packs for Hair Fall: జుట్టు రాలడం అనేది చాలా కామన్ సమస్య. దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అయితే మన ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో మన జుట్టుని మనం కాపాడుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులతో ఎలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుందో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎగ్ - ఒలివ్ ఆయిల్ ప్యాక్:


ముందుగా ఒక కోడిగుడ్డు, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఒలివ్ ఆయిల్ కలిపి.. ఒక మిశ్రమం లా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుతో పాటు స్కాల్ప్ పై రాసుకోవాలి. 30 నిమిషాలు ఉంచిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.


అలొవేరా - తేనె ప్యాక్:


2 టేబుల్ స్పూన్స్.. అలొవేరా జెల్ లో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి జుట్టు తో పాటు.. కుదుళ్లకు కూడా బాగా పట్టించాలి. 30 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


ఉల్లి రసం ప్యాక్:


ఒక ఉల్లిపాయని గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని జుట్టు పై రాసి 30 నిమిషాలు ఉంచిన తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేయాలి.


మల్లెపువ్వ ప్యాక్:


కొన్ని మల్లెపువ్వ ఆకులను.. నీటితో గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఆ పేస్ట్ ని జుట్టుకి కుదుళ్లకు, చివర్లకి బాగా రాసి 30 నిమిషాలు ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి.


కొబ్బరి పాలు ప్యాక్:


కొబ్బరి పాలు, తేనె సమప్రమాణంలో తీసుకోవాలి. వాటిని కలిపి ఆ మిశ్రమాన్ని.. జుట్టు కి బాగా రాసుకోవాలి. అరగంట ఉంచిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి.


మెంతి గింజల ప్యాక్:


మెంతి గింజలను రాత్రంతా నీటిలో.. నానబెట్టాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్..చేయాలి. ఆ పేస్ట్ ని జుట్టు కి రాసి 30 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేసుకోవాలి.


కరివేపాకు ప్యాక్:


కరివేపాకు నీటిలో మరిగించి, ఆ నీరు సగం అయ్యేవరకు ఉంచాలి. అది చల్లారిన.. తర్వాత జుట్టు పై రాసుకోవాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.


పెరుగు - తేనె ప్యాక్:


పెరుగు, తేనె సమప్రమాణంలో తీసుకుని ఒక పేస్ట్ లాగా చేసి జుట్టు పై రాసుకోవాలి.
30 నిమిషాలు ఉంచిన తర్వాత షాంపూతో వాష్ చేయాలి.


ఇలా చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు రాలడం త్వరగా నియంత్రించవచ్చు. ఇలా సహజమైన పద్ధతులు పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


Also Read: Telangana Thalli Statue: తెలంగాణలో బుల్డోజర్‌ పాలన? తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా స్థానం లేదా?


Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter