Home Remedies for Dandruff: మీ జుట్టు నుంచి పొడిగా చర్మం విడుదల అయితే దానిని చుండ్రుగా పరిగణించవచ్చు. ఇలా చుండ్రు వచ్చినప్పుడు మీకు దురదగా కూడా ఉంటుంది. మీ బజారులో దొరికే ఏ ఉత్పత్తితో అయినా మీ చుండ్రుని పూర్తిగా నివారించడం కష్టం. పైగా ఆ ఉత్పత్తులు ఖర్చుతో కూడుకున్నవి. అలా కాకుండా మీరు అతి తక్కువ ఖర్చుతో, సహజంగా మీ ఇంట్లోనే చుండ్రుని పరిపూర్ణంగా నివారించవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ ఇంట్లోనే మీ చుండ్రుని నివారించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు.


నిమ్మకాయ 
నిమ్మ రసంలో ఉండే ఉపయోగకరమైన పదార్థాలు వెంట్రుకలను చైతన్యవంతంగా చేసి చుండ్రుని తొలగిస్తుంది. కేవలం మీరు రాత్రి పడుకునే ముందు నిమ్మ రసంతో మీ జుట్టుని మర్దన చేస్తే సరిపోతుంది. ఉదయం లేచాక మీ జుట్టుని చల్లని నీటితో కడగాలి. మీరు ఒక వంతు నిమ్మ రసంతో పాటు రెండు వంతుల కొబ్బరి నూనెతో కూడా మర్దన చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలా మర్దన చేయడం వలన మీ చుండ్రుని నివారించవచ్చు.


Sarkaru Vaari Paata Movie Shooting: స్పెయిన్ లో మహేష్ మానియా.. వీడియో వైరల్


ప్రకృతి పరమైన చికిత్స
ఒక చిటికెడు  కర్పూరంని కొబ్బరి నూనెతో లేక వేప నూనెతో సగం కప్పు నింపబడిన దానిలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మీద మర్దన చేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఉదయం లేచాక నీటితో కడగాలి. మరియు ఒక చిటికెడు ఆముదము, ఆవ నూనె మరియు కొబ్బరి నూనె కలిపి మర్దన చేసి ఒక రాత్రంతా ఉంచాలి. ఉదయం వెచ్చటి నీటితో కడిగితే చుండ్రుని నివారించవచ్చు.


ఉసిరి 
ఉసిరి నూనె తో మీ తల పై మర్దన చేయాలి. తరువాత కొద్దిగా తడితో ఉన్న టవల్ ని మీ తల చుట్టూ కట్టి ఒక అరగంట పాటు ఉంచాలి. ఆ తరువాత ఒక మోస్తరు నీటితో కదిగినట్లయితే మీకు చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది. 


వెనిగర్
వెనిగర్ తో చికిత్స చేయడం వలన మీ జుట్టు యొక్క pH సమతుల్యత సరిచేయబడుతుంది. వెనిగర్ వాడడం వలన మీ జుట్టులో షాంపూల వలన మరియు ఇతర ఉత్పత్తుల వలన ఉండిపోయిన అవశేషాలు తొలగిపోతాయి.  ఒక చిటికెడు వెనిగర్ ని ఒక కప్పు స్వచ్చమైన నీటిలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి అంటి ఒక రాత్రంతా ఉంచి ఉదయం షాంపూతో కడగాలి. ఇలా చేస్తే మీ చుండ్రు తొలగిపోతుంది.


Also Read: Unstoppable Talk Show Promo: 'వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' అంటున్న బాలయ్య


పైన చెప్పిన చిట్కాలతో కేవలం చుండ్రు పోవడమే కాకుండా ఒక పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి