Unstoppable Talk Show Promo: 'వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' అంటున్న బాలయ్య

బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ NBK ప్రోమో విడుదలైంది. నవంబర్ 4 నుండి ప్రారంభం కాబోతున్న ఈ షో ప్రోమో చూసి ఎలా ఉందొ మీరే చెప్పండి 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2021, 06:35 PM IST
  • విడుదలైన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రోమో
  • భారీ డైలాగ్ లతో ఇరగదీసిన నందమూరి నట సింహం
  • "దెబ్బకు థింగ్ మారిపోవాలా.. కలుద్దాం ఆహాలో" అంటున్న బాలయ్య
Unstoppable Talk Show Promo: 'వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..' అంటున్న బాలయ్య

  Balakrishna's Unstoppable Talk Show Promo: నట సింహం బాలకృష్ణ (Hero Balakrishna) బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.. ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' (Aha)లో అన్‌స్టాపబుల్ పేరుతో బాలయ్య హోస్ట్ గా ఒక టాక్ షో రానున్న విషయం కూడా తెలిసిందే! ఈ రోజే టాక్ షో సంబంధించిన ప్రోమోని 'ఆహా'యూనిట్ విడుదల చేశారు.. అద్భుతంగా ఉన్న టాక్ షో ప్రోమోలో బాలయ్య ఎనర్జిటిక్ గ కనిపిస్తున్నారు.. విడుదలైన ప్రమోలో బాలయ్య ఎప్పటిలాగే పవర్ డైలాగ్ లను వాడారు.. 

ప్రమో ప్రారంభమయ్యాక.. బైక్, స్పోర్ట్స్ కార్, గుర్రంపై బాలయ్య కనపడగా... 'నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య సిద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు.. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింగ్ మారిపోవాలా.. కలుద్దాం ఆహాలో' అంటూ బాలయ్య (Balayya) చెప్పిన డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. 

 

Also Read: YS Sharmila Padayatra: వైఎస్ షర్మిల పాద యాత్రలో పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల

ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం ఈ షోకు ఇప్పటికే ప్రచారం మొదలెట్టగా.. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై ఊపేసే బాలయ్య బుల్లితెరపై ఎలా నటిస్తారో కూడా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. దీపావళి (Deepavali) కానుకగా నవంబర్ 4 న ప్రసారం కానున్న ఈ షోలో మొదటి గెస్ట్ గా మోహన్ బాబు (Mohanbabu) రానున్నారని తెలుస్తుంది. 

మొదటి సీజన్ లో 12 ఎపిసోడ్స్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని.. ఈ షోకు బాలయ్య ఒక్కో ఎపిసోడ్ కు 40 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం. బాలయ్యకు సీన్స్ చెప్తున్న ప్రశాంత్ ఫోటోలు ఇప్పటికే  తెగ వైరల్ అయిపోతున్నాయి.. మరీ బుల్లితెరపై బాలయ్య ఏ రేంజ్ లో ఆడుకోబోతున్నాడో తెలియాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే!

Also Read: Ex & Current Girlfriend Fighting: ప్రేమ ఎంత మధురం.. ప్రియురా"ళ్లు" అంత కఠినం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x