Eggs vs Nuts: అల్పాహారం మన డైలీ రొటీన్లో ఎంతో ముఖ్యం. 12 గంటల సుదీర్ఘ బ్రేక్‌ తర్వాత బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకుంటాం. అల్పాహారాన్ని స్కిప్ చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, సాధారణంగా ఇడ్లి, దోశ, పూరీ తింటాం. అయితే, ఆరోగ్యకరంగా ఉండటానికి లైట్‌ బ్రేక్‌ పాస్ట్‌ తింటారు గుడ్లు, గింజలు వంటివి డైట్లో చేర్చుకుంటారు. అయితే, గుడ్డు తినాలా? గింజలు తినాలా? ఏవి ఎక్కువ ఆరోగ్యకరం మీకు తెలుసా? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుడ్డు..
గుడ్డు పోషకాలకు పవర్‌ హౌజ్. ఇందులో మన శరీరానికి కావాల్సినంత పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు ఎక్కువ ఉంఆయి. కండరాలను రిపెయిర్ చేసే అభివృద్ధి చేసే అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంతేకాదు గుడ్డులో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డీ, బీ12, సెలీనియం, కోలిన్ ఉంటాయి.


ఆరోగ్య ప్రయోజనాలు..
కండరాల అభివృద్ధి ఉంటుంది. కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది.


బ్రెయిన్ ఆరోగ్యం..
ఇందులోని కోలిన్ బ్రెయిన్ పనితీరుకు తోడ్పడుతుంది.


బరువు నిర్వహణ..
గుడ్డు తింటే ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో ఎక్కువ తినకుండా ఉంటాయి. బరువు కూడా పెరగరు


ఇదీ చదవండి: బీరకాయను ఈ మండే ఎండలకు మీ డైట్లో చేర్చుకుంటే ఈ 12 ఆరోగ్య ప్రయోజనాలు..
గింజలు..
గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాల్నట్స్‌, బాదంలో ఇవి పుష్కలంగా ఉంటాయి. గింజల్లో విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి.


ఆరోగ్య ప్రయోజనాలు..
షుగర్ కంట్రోల్..
గింజల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు ఇవి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


ఇదీ చదవండి: ఈ 5 ఆరోగ్యకరమైన గింజలు స్ట్రోక్‌ రాకుండా హార్ట్‌ బ్లాకేజీలను నివారిస్తాయి..


దీర్ఘాయువు..
గింజలను మన డైట్లో చేర్చుకుంటే ఎక్కువ రోజులు బతుకుతారని ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని నివేదికలు తెలిపాయి. కేన్సర్, కార్డియో, టైప్ 2 డయాబెటిస్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు.


రెండూ గుడ్లు, గింజలు ఆరోగ్యకరం సమతుల ఆహారం ఉంటుంది.  కండరాల అభివృద్ధి, బ్రెయిన్ మెరుగైన పనితీరుకు గుడ్డు మంచి ఆప్షన్. గుండె, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే గింజలు తినండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook