How To Make Cucumber Face Cleanup: దోసకాయ సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో  95% వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే వేసవి కాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీర హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే దీని వల్ల చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దోసకాయను ఫేస్ క్లీనప్‌ తయారు చేసి వినియోగించడం వల్ల ముఖంపై రంధ్రాలను లోతుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొడి చర్మాన్ని కూడా నియంత్రిస్తుంది. దోసకాయలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయ. దీంతో సులభంగా వృద్ధాప్య సంకేతాలు కూడా దూరమవుతాయి. అయితే దోసకాయ ఫేస్ క్లీనప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దోసకాయ ఫేస్ క్లీనప్ చేయడానికి కావలసిన పదార్థాలు:
1 దోసకాయ
1/4 టీస్పూన్ కాఫీ
1 టీస్పూన్ తేనె


దోసకాయ ఫేస్ క్లీనప్ తయారి విధానం ?
ఈ ఫేస్ క్లీనప్‌ను తాయారు చేసుకోవడానికి ముందుగా సెలైన్ ద్రావణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత దోసకాయను బాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేయాలి.
అదే గిన్నెలో 1 టీస్పూన్ తేనె మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా అందులో పావు టీస్పూన్ కాఫీని వేయండి.
తర్వాత పై పదార్థాలను మిశ్రమంగా కలుపుకోవాల్సి ఉంటుంది.
అంతే సులభంగా దోసకాయ ఫేస్ క్లీనప్ తయారు అయినట్లే..


దోసకాయ ఫేస్ క్లీనప్‌ను ఇలా వినియోగించండి?
తేలికపాటి చేతులతో మసాజ్ చేస్తూ ముఖంపై దోసకాయ ఫేస్ క్లీనప్‌ను అప్లై చేయండి.
నెమ్మదిగా 2 నుంచి 3 నిమిషాల పాటు మీ ముఖాన్ని మసాజ్ చేయండి.
ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేయండి.
ఇలా 20 నిమిషాల తర్వాత కాటన్, నీళ్లతో సహాయంతో ముఖాన్ని శుభ్రం చేయండి.
దోసకాయ ఫేస్ క్లీనప్‌ను రెండు సార్లు అప్లై చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Honey Rose Pics : బాప్‌ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ


Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook