Face Serum Benefits: ముఖంపై ఎలాంటి మొండి మచ్చలున్నా ఈ సీరమ్‌తో 5 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
Face Serum Benefits: ప్రతి ముఖానికి ఫేస్ సీరమ్ అప్లై చేస్తే రోజూ ముఖానికి ఫేస్ సీరమ్ అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Face Serum Benefits: ప్రస్తుతం చాలా మంది చర్మాన్ని కాలుష్యం నుంచి సంరక్షించుకునేందుకు టోనర్స్, ఫేస్ ప్యాక్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటికి బదులుగా ఫేస్ సీరమ్స్‌ను వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని సంరక్షించడమేకాకుండా చర్మవ్యాధుల నుంచి రక్షించేందుకు సహాయపడుతుంది. కాబట్టి టోనర్స్‌కి బదులుగా సీరమ్స్‌ను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చలి కాలంలో చర్మానికి సీరమ్స్‌ను వినియోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫేస్ సీరమ్ అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
>>సీరమ్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై చర్మం మెరుగుపడడమే కాకుండా ఫేస్‌పై చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కొల్లాజెన్ కంటెంట్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి చర్మాన్ని అనారోగ్య సమస్యల నుంచి సంరక్షిస్తుంది.
>>ఫేస్ సీరమ్ ప్రతి రోజూ చర్మానికి అప్లై చేస్తే నిర్జీవంగా తయారైన చర్మం సులభంగా అందంగా తయారవుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ముఖంలోని మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
>>ఫేస్ సీరమ్ అప్లై చేయడం వల్ల కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలకు చెక్ పెట్టొచ్చని చర్మ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి కళ్ల అందాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
>>విటమిన్ సి ఫేస్ సీరమ్‌ను ప్రతి రోజూ చర్మానికి అప్లై చేయడం వల్ల సులభంగా ఎండ వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ఫేస్ సీరమ్ వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు
Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook