Facial Benefits for Skin: ఏదైనా పార్టీలు, పెళ్లిళ్లు ఉంటే ఫేషియల్‌ చేయించుకుంటాం. దీంతో ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది చర్మంపై డెడ్‌ స్కిన్‌ కూడా తొలగిస్తుంది. అయితే, నెలలో కనీసం ఒక్కసారైనా ఫేషియల్‌ చేసుకుంటే మీ చర్మానికి ఆరు ఆరోగ్య ప్రయోజనాలు. ఇది చర్మాన్ని క్లెన్సింగ్‌, ఎక్స్‌ఫోలియేటింగ్‌, మాయిశ్చరైజింగ్‌ గుణాలు ఉంటాయి. దీంతో మీ ముఖం పునరుజ్జీవనం అందుతుంది. బ్లడ్‌ సర్క్యూలేషన్‌ మెరుగవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖం స్ట్రెస్‌ లేకుండా మెరుస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫేషియల్‌ చేసుకుంటే ముఖానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.


స్కిన్‌ క్లెన్స్..
ముఖానికి క్లెన్సింగ్‌ అందిస్తుంది. అంతేకాదు ఫేషియల్‌ చేయించుకోవడం వల్ల ముఖానికి గ్లో వస్తుంది. ముఖానికి స్టీమ్‌ ఇవ్వడం వల్ల ఓపెన్‌ పోర్స్‌ మూసుకుపోతాయి. ముఖం అందంగా మారిపోతుంది.


బ్లడ్‌ సర్క్యూలేషన్..
ముఖానికి ఫేషియల్‌ చేయించుకోవడం వల్ల బ్లడ్‌ సర్క్యూలేషన్‌ మెరుగవుతుంది. తరచూ ముఖానికి ఫేషియల్‌ చేయించుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్‌, ఖనిజాలు రక్త కణాలు ఆరోగ్యంగా ఉంచి స్కిన్‌ కాంతివంతమవుతుంది.


ఇదీ చదవండి: ముఖం పై ట్యాన్ పోవట్లేదా? ఈ ఈజీ హోమ్ రెమిడీ తో చెక్ పెట్టండి..


పునరుజ్జీవనం..
వాతావరణంలోని మార్పులు, పొల్యూషన్‌ కారణంగా ముఖంపై వ్యర్థాలు పేరుకుని పోతాయి. ఫేషియల్‌ చేసుకోవడం వల్ల  ముఖానికి పునరుజ్జీవనం అందుతుంది. ఫేషియల్‌ లో ఉపయోగించే ఉత్పత్తుల్లో గీతలు తగ్గించే గుణం కూడా ఉంటుంది.


స్కిన్‌ డిటాక్సిఫై..
పేషియల్‌ చేయించుకోవడం వల్ల స్కిన్‌ డిటాక్సిఫికేట్‌ అవుతుంది. ఇందులో ఉపయోగించే ఉత్పత్తుల్లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. అంతేకాదు సముద్రపు ఉప్పు, ఆయిల్స్‌ ఉంటాయి. దీంతో ఫేషియల్స్‌ చర్మాన్ని డిటాక్సిఫై చేసి ముఖానికి యవ్వనాన్ని అందిస్తుంది.


ఇదీ చదవండి:  రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్‌ వాటర్‌ అప్లై చేస్తే కలిగే లాభాలు ఇవే..


వృద్ధాప్యం..
తరచూ ముఖానికి ఫేషియల్‌ చేయించడం వల్ల ముఖానికి మంచి మసాజ్‌ దొరుకుతుంది. దీంతో మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. కణాలకు పునరుజ్జీవనం అంది ముఖంపై గీతలు మచ్చలు తగ్గిపోతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter