Fatty Liver Treatment: నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు..తప్పకుండా ఇలా చేయాల్సి ఉంటుంది.
Fatty Liver Treatment: కాలేయంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా చాలా మందిలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Fatty Liver Treatment: కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడం వల్ల వచ్చే వ్యాధిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. దీని వల్ల చాలా మందిలో బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా చాలా మందిలో గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. లేకపోతే జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చికిత్స చేయించుకోకపోతే సిర్రోసిస్‌తో సహా కాలేయం దెబ్బతింటుంది. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అనేది NAFLD రూపాన్ని సూచిస్తుంది. దీనిలో అధిక కొవ్వు కణాల కారణంగా కాలేయానికి మంట, తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తీసే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారిలో పలు రకాల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కడుపు ఉబ్బరం:
వరల్డ్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రకారం..సిర్రోసిస్ ఉన్న 80 శాతం మందిలో జీర్ణశయ సమస్యలేకాకుండా 49.5 శాతం మందిలో అపానవాయువు సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదర కుహరంలో ద్రవం పేరుకుపోవడం వల్ల వాపు సంభవించడమేకాకుండా ఉదర ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
పొత్తికడుపు నొప్పి:
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్న చాలా మందిలో పొత్తి కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలున్నవారు కడుపు నొప్పితో పాటు.. వికారం వంటి సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
అజీర్ణం:
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD), గుండెల్లో మంట, రెగర్జిటేషన్, త్రేనుపు వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చికిత్స ఆలస్యమైతే గ్యాస్ట్రిక్ రక్తస్రావం వంటి సమస్యలు కూడా రావొచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?
Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి