Fenugreek Tea: మెంతి గింజలు శరీరాని చాలా ప్రయోజనాలను ఇస్తాయి. అంతే కాకుండా వీటితో చేసిన టీ తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి గింజల్లో యాంటాసిడ్‌ స్థాయి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో యాసిడ్ రిఫ్లెక్స్‌ ను ప్రభావితం చేస్తుంది. ఈ టీ గాయాలతో బాధపడుతున్న వారికి యాంటిబెటిక్‌గా పనిచేస్తుంది.  అంతేకాకుండా మెంతుల్లో ఉండే గుణాలు శరీరానికి అనేక లాభాలను కలిగిస్తుంది. కాబట్టి మెంతి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది:
 
మెంతులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా మెంతి టీ తాగడం వల్ల కడుపులో రాళ్ల సమస్య దూరమవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గలనుకుంటున్న వారు ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గోచ్చని నిపుణులు చెబుతున్నారు.  


షుగర్ లెవెల్‌ను అదుపులో ఉంచుతుంది:


మీడియా నివేదికల ప్రకారం...మెంతి గింజలలో చాలా పోషకాలుంటాయి. కావున ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగకుండా నిరోధిస్తుంది.


మెంతి టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి:


మెంతి టీ తయారు చేయడానికి..ముందుగా ఒక చెంచా మెంతి పొడిని తీసుకొని వేడి నీటిలో కలపండి. ఆ తర్వాత మెంతులను వడకట్టాలి. ఇలా వడకట్టిన తర్వాత పానీయంలో నిమ్మరసాన్ని కలపండి. దానికి కొంచెం తేనె కలిపి తాగండి.


(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)


Also Read: Thyroid Control Juice: ఈ మూడు జ్యూస్‌లు తాగండి..థైరాయిడ్‌ నుంచి ఉపశమనం పొందండి.!!


Also Read: Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook