Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!

Benefits Of Sea Salt: మారతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఖరీదైన జుట్టు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 01:09 PM IST
  • సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు
  • సముద్రపు ఉప్పు చర్మానికే కాదు జుట్టుకు ప్రయోజమే
  • సముద్రపు ఉప్పు వల్ల తలపై మెరుగైన రక్త ప్రసరణ
Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!

Benefits Of Sea Salt: మారతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఖరీదైన జుట్టు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది. అటువంటి పరిస్థితిలో సముద్రపు ఉప్పును ఉపయోగించి సమస్యల నుంచి విముక్తి  పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు సంరక్షణలో సముద్రపు ఉప్పును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

జిడ్డు జుట్టు:

స్నానం చేసే నీటిలో సముద్రపు ఉప్పును కరిగించి జుట్టును కడగండి. దీని వల్ల జుట్టులో ఉండే  జిడ్డు తొలగిపోతుంది. ఇది స్కాల్ప్ పై అదనపు నూనెను తగ్గించి సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జుట్టు రాలడం:

సముద్రపు ఉప్పుతో తలకు మసాజ్ చేయడం ద్వారా.. జుట్టు రాలడం వంటి సమస్యలకు బైబై చెప్పొచ్చు. అంతేకాకుండా జుట్టు బలంగా మారుతుంది.

మెరుగైన రక్త ప్రసరణ:

సముద్రపు ఉప్పులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, జింక్, సల్ఫర్, బ్రోమైడ్, క్లోరైడ్ వంటి ఖనిజాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

చుండ్రు పోతుంది:

 సముద్రపు ఉప్పును క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారి చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

బెస్ట్ హెయిర్ ఎక్స్‌ఫోలియేటర్:

కెమికల్ బేస్డ్ హెయిర్ ప్రొడక్ట్స్ జుట్టును డ్యామేజ్ చేస్తాయి. అదే సమయంలో పోషకాలు అధికంగా ఉండే సముద్రపు ఉప్పు జుట్టుకు సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది.

Also Read: World No Tobacco Day 2022: నేడే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం..ఇంటి చిట్కాలతో ధూమపానానికి దూరం..!!

Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News