భారత దేశంలో ( India ) ఒక పౌరుడు ఎక్కడికి అయినా వెళ్లవచ్చు. ఏ ప్రదేశంలో అయినా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేక అనుమతి అవసరం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎంట్రీ తీసుకోవడానికి మిగితా ప్రాంతాల్లా స్వేచ్ఛ ఉండదు. దీని కోసం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రదేశాలు బార్డర్ కు అతి దగ్గరగా ఉండటంతో దేశ రక్షణ కోసం ఇలా చేయాల్సి ఉంటుంది. ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందామా ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ: Nature Wonders: 5 Colors లో ప్రవాహించే నీటి ధారా.. నేచురల్ వండర్


కోహిమా, నాగాలాండ్  ( Kohima, Nagaland )


నార్తీస్ట్ స్టేట్ అయిన నాగాలాండ్ ( Nagaland ) కు క్యాపిటల్ కోహిమా. అంగామి నాగా అనే తెగవారు ఎక్కువగా నివసిస్తుంటారు. దీన్నే Switzerland of Asia అని కూడా అంటారు. ఈ పర్వత రాష్ట్రానికి చేరుకోవాలి అంటే ముందుస్తు అనుమతి తప్పనిసరి.


లోక్టక్ లేక్, మణపూర్ ( Loktak Lake, Manipur )
లోక్తక్ లేక్ లో చిన్న చిన్న భూభాగాలు తేలుతూ కనిపిస్తాయి. ఇందులో నీరు ఎప్పుడు ఎండిపోదు. ఇక్కడికి వెళ్లాలి అంటే తప్పకుండా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


చాంగు లేక్, సిక్కిం ( Changu Lake, Sikkim )
సిక్కింలో ఎక్కువగా ఇష్టపడే పర్యటక ప్రదేశాల్లో చాంగు సరస్సు కూడా ఒకటి. కొన్ని దశాబ్దాలుగా ఈ సరస్సులో నీరు గడ్టకట్టుకుని ఉంటాయి. ఈ సరస్సును చూడాలి అనుకుంటే పర్మిషన్ ముందే తీసుకోవాలి.



ALSO READ| Manhole: మ్యాన్ హోల్ ను మ్యాన్ హోల్ అని ఎందుకంటారో తెలుసా ?


జీరో వ్యాలి, అరుణాచల్ ప్రదేశ్ ( Zero Valley, Arunachal Pradesh )
అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలి అనుకునేవారు ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఇక్కడ జీరో వ్యాలీకి చాలా మంది వస్తుంటారు. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు సాధించింది.


ఐస్వాల్, మిజోరం ( Aizwal, Mizoram )
మిజోరం క్యాపిట్ ఐస్వాల్ లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రపంచంలోనే అనేక ప్రదేశాల నుంచి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. హిల్ స్టేషన్ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. అయితే దీని కోసం ముందు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR