Marriage Tips: పెళ్లికి ముందు పార్ట్నర్ గురించి ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.. అవేమిటంటే
Relationship Tips In Telugu : పెళ్లి అంటే అబ్బాయి గురించి అమ్మాయి.. అమ్మాయి గురించి అబ్బాయి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని కచ్చితంగా అడిగి మరీ తెలుసుకోవడం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ సంతోషమైన భవిష్యత్తుకు ఎంతో అవసరం.
Happy Marriage: పెళ్లి అనేది భార్యాభర్తల మధ్య శాశ్వతమైన బంధం.ఇది చిన్న పిల్లల ఆట కాదు.. కాబట్టి మీ భాగస్వామితో ఈ ఐదు విషయాలను కచ్చితంగా చర్చించడం మర్చిపోకండి. ఈ ఐదు విషయాలు మీ మధ్య అవగాహన ఏర్పరచడమే కాక భవిష్యత్తులో సమస్యలను రాకుండా చేస్తాయి . సంతోషకరమైన కాపురానికి ఈ ఐదు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం..
జీవనశైలి..
వేరువేరు కుటుంబాల నుంచి వస్తారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే రకమైన జీవనశైలి ఉండాలి అన్న నియమం ఉండదు. మనం పెరిగిన వాతావరణం, మన చుట్టూ ఉన్న వారి ప్రవర్తనను పట్టి మన ఆలోచన ఉంటుంది. అయితే కొత్తగా బంధాన్ని మొదలుపెట్టేవారు పాత బంధాలు.. బంధుత్వాలు కారణంగా ఏర్పడిన చికాకులను వారి సంసారంలోకి తీసుకురాకూడదు. పెళ్లి తర్వాత ఆడవారికి కాదు మగవారికి కూడా తమ జీవిత భాగస్వామిపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ఇద్దరు తమ జీవన శైలి గురించి చర్చించుకోవాలి.. పరస్పర అభిప్రాయాలను గౌరవించాలి.
భవిష్యత్తు ప్రణాళిక..
ప్రతి ఒక్కరికి తమ జీవితం గురించి ఎన్నో కలలు ఉంటాయి.. కొన్ని తీరని కోరికలు ఉంటాయి. జీవితంలో ఎదగాలి అంటే ఉద్యోగం లేక వ్యాపారంలో కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. భాగస్వామి కలలు గురించి తెలుసుకోవడంతో పాటు వారికి జీవితంలో ఎదగడానికి అవసరమైన మానసిక ధైర్యాన్ని కూడా అందివ్వాలి. మీ భాగస్వామికి మద్దతుగా నిలిచి వారి జీవితంలో ఎదిగేలా ప్రోత్సహించాలి.
సంబంధ బాంధవ్యాలు..
కొత్తగా పెళ్లయిన వారికి తమ జీవిత భాగస్వామిపై కొన్ని అంచనాలు ఉంటాయి. వీటి గురించి మాట్లాడుకోవాలి.. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఏమి ఆశిస్తున్నారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ప్రతిరోజు నిద్ర లేచాక.. పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి.. తమ సంతోషమే కాదు భయాల గురించి కూడా పంచుకోవాలి. అప్పుడే ఆ బంధం దృఢంగా మారుతుంది.
ఆర్థిక పరిస్థితి..
పెళ్లి అంటే ఎవరికైనా విపరీతమైన ఖర్చు ఉంటుంది. సినిమాల్లో చూపించినట్టుగా పెళ్లయిన కొత్తల్లో అన్ని జరగాలంటే కొన్నిసార్లు కుదరదు. మన ఆర్థిక పరిస్థితి ఎలాంటిది.. ఆదాయం ఎంత.. వ్యయం ఎంత.. అప్పులు ఏమన్నా ఉన్నాయా.. భవిష్యత్తుకు ఎలా పొదుపు చేసుకోవాలి లాంటి అంశాలను భార్యాభర్తలు క్షుణ్ణంగా చర్చించుకోవాలి. ఎప్పుడైతే ఆర్థికపరమైన చికాకులు ఉండవు అప్పుడు ఆ సంసారం సుఖంగా సాగుతుంది.
పిల్లలు..
ఇంట్లో పెద్దవారు కోరుకున్నారని.. లేక పక్కింటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని పిల్లల విషయంలో తొందర పడకూడదు. మీ బంధం దృఢంగా ఉన్నప్పుడు.. పిల్లల బాధ్యత తీసుకోగలము అన్న నమ్మకం కలిగినప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి. అందుకే మీరు ఎప్పుడు తల్లిదండ్రులు కావాలి అనుకుంటున్నారు అన్న విషయాన్ని ముందుగానే చర్చించుకోవాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలము అన్న నమ్మకం మీ జీవిత భాగస్వామికి అందివ్వడం ఎంతో ముఖ్యం.
Also Read: Samantha: నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత షాకింగ్ పోస్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter