Samantha: నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత షాకింగ్ పోస్ట్..

Samantha Viral Tweet: సమంత తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో పోస్టులు వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సమంత ఈరోజు వేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 22, 2024, 02:55 PM IST
Samantha: నువ్వు గెలవడం నేను చూడాలి.. సమంత షాకింగ్ పోస్ట్..

Samantha Ruth Prabhu: సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా ఏం మాయ చేసావేతోనే అందరినీ మాయ చేసింది ఈ హీరోయిన్. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరియర్ దూసుకుపోతున్న సమయంలోనే తను ప్రేమించిన హీరో నాగచైతన్య అని పెళ్లి చేసుకొని అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. మొదటి నాలుగు సంవత్సరాలు బాగానే సాగిన ఆ తర్వాత మాత్రం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

విడాకులకు కలిగిన కారణాలు ఇప్పటికీ తెలియకపోయినా.. వీరిద్దరూ విడిపోవడానికి కారణం నాగచైతన్య మరో హీరోయిన్ తో ప్రేమలో ఉండదమే అని ఎన్నో రూమర్స్ వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే నాగచైతన్య హీరోయిన్.. శోభితతో ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమధ్య కూడా వీరిద్దరూ వెకేషన్ కి వెళ్లారు అంటూ.. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకే చోట.. షేర్ చేసిన ఫోటోలను వైరల్ చేశారు నేటిజన్స్. అంతేకాకుండా సమంత నాగచైతన్య విడాకులు ప్రకటించిన రోజు.. సమంత ఫ్రెండ్ అయినా ఒక ఫ్యాషన్ డిజైనర్.. తన స్టేటస్ లో ‘ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా బిచ్’ అని ఒక అమ్మాయిని ఉద్దేశిస్తూ స్టేటస్ పెట్టడం గమనర్హం.

ఈ క్రమంలో ఇప్పుడు సమంతా పెట్టిన మరో ఇంస్టాగ్రామ్ ఫోటో కూడా వైరల్ అవుతూ అందరిని షాక్ కి గురి చేస్తోంది. ‘నువ్వు గెలవడం నేను చూడాలి’ అంటూ ముందు వెనక ఏమీ లేకుండా ఒక పోస్ట్ షేర్ చేసింది సమంత. అసలు ఎవరు గెలవడం సమంత చూడాలి అనుకుంటుంది అని అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

ఆ ఫోటో షేర్ చేస్తూ.. ‘నీ హృదయం ఏం కోరుకుంటే, నువ్వు ఏం అవ్వాలనుకుంటే నేను దానికి సపోర్ట్ చేస్తాను. మీరు విజయానికి అర్హులు’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఎవరికోసం సమంత ఈ పోస్ట్ పెట్టింది అని అందరూ తల పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటో సమంత ఎవరికోసం పెట్టిందో తెలియాలి అంటే సమంతానే జవాబు ఇవ్వాలి.

 

 
 
 
 
 

 

Also read: Samsung Galaxy Z Flip: శాంసంగ్ నుంచి 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌తో Samsung Galaxy Z Flip 6 ఫోల్డబుల్ ఫోన్ త్వరలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

 

 

Trending News