Foamy Urine Causes: మూత్రంలో నురుగు వస్తే తస్మాత్ జాగ్రత్త..ఎందుకంటే!
Foamy Urine Causes: మూత్రంలో నురుగు వస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు వైద్యుల సూచనలు సలహాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Foamy Urine Causes: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూత్ర సమస్యలు కూడా విపరీతంగా పెరగుతున్నాయి. కొంతమందిలో ఎక్కువగా మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు మూత్రం వస్తోంది. చాలా మందిలో అతిగా కూల్ డ్రీక్స్ తీసుకోవడం వల్ల కూడా మాత్రంలో నురుగు వస్తోందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మీలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మూత్రవిసర్జన సమయంలో ముత్రం పచ్చగా రావడం, నురుగు రావడం వంటి లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే కొంతమందిలో మూత్ర పిండాలు దెబ్బతినడం వల్ల కూడా మూత్రంలో శరీరం నుంచి ప్రోటీన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా కిడ్నీల ఫంక్షన్స్ దెబ్బతినడం కారణంగా కూడా ఇలా నురుగు మూత్ర వచ్చే ఛాన్స్ ఉంది.
దీంతో పాటు కొంతమందిలో మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థ పదార్థాల వడపోతలో కూడా మార్పుల కారణంగా కూడా మూత్రం నురుగు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే మూత్రం నురుగు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో డీహైడ్రేషన్, కిడ్నీ వ్యాధి, మధుమేహం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలా నురుగు తరచుగా వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మూత్రంలో నురుగు రావడానికి ముందు వచ్చే లక్షణాలు:
వికారం
బరువు తగ్గడం
మూత్రపిండ వ్యాధి
వికారం
ఆకలి తగ్గింపోవడం
తలనొప్పి
ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యుల సలహాలు తప్పనిసరి:
అలసిపోవడం
దాహం అతిగా వేయడం
నిద్రలో ఇబ్బందులు
వాంతులు రావడం
మూత్రంలో నురుగు వల్ల వచ్చే వ్యాధులు:
శరీరంలో ప్రోటీన్ లోపం
మూత్రపిండాలు దెబ్బతినడం
గుండె సమస్యలు
మూత్ర సమస్యలు
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
మూత్రంలో నురుగు వస్తున్నవారు ఏమి తినాలి, ఏమి తినకూడదు:
ఇవి తినండి:
గుడ్లు
చేపలు
ధాన్యం
ఆకు కూరలు
పండ్లు
పాల, పెరుగు, జున్ను
ఈ పనులు చేయోద్దు:
ధూమపానం చేయోద్దు
ఆల్కహాల్ మానుకోండి
నీటిని తాగకుండా ఉండడం
మూత్రం ఆపుకోవద్దు
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి