Reduce Bad Cholesterol: కొలెస్ట్రాల్ రక్తం సరఫరా చేసే ధమనులలో పేరుకుపోయి, వయసుతో పాటు వాటి స్థాయి కూడా పెరిగిపోయి గుండె సంబంధిత ప్రమాదాలకి దారితీస్తాయి. కార్డియాలజిస్ట్ వైద్యుల సూచనల ప్రకారం వయసు 20 దాటిన ప్రతీ ఒక్కరిలో కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావున ప్రతి ఒక్కరు శరీరంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించే ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాలి. ఆహారంతో పాటు తగిన వ్యాయామం చేయడం మాత్రం మరవకూడదు. ఇలా చేయడం వలన నెమ్మదిగా మీ యొక్క కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి, గుండె సంబందిత వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. మీ యొక్క జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వలన ఆరోగ్యవంతంగా ఉంటారు.


ఫైబర్ ఫుడ్:
ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోతుంది. బీన్స్, చిక్కుడుకాయ వంటి కురగాయాలలో ఎక్కువగా ఫైబర్ పదార్థం ఉంటుంది. ఈ పదార్థం కొలెస్ట్రాల్ తో బంధనం ఏర్పరచుకుని, దాని యొక్క స్థాయి 5 శాతం వరకు తగ్గిస్తుంది. ఫైబర్ పదార్థంలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి చాలా తరుచుగా దొరికే కూరగాయలు. కోరిందకాయలు, బేరి (పియర్స్) పండ్లను పొట్టుతో పాటు తినాలి. ఆపిల్ కూడా తొక్క తీయకుండా తినాలి. పండ్లు మరియు కురగాయాలలో ఎక్కువగా ఫైబర్ పదార్థాలు ఉంటాయి.


ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి ఎక్కువగా సాల్మన్, మకెరేల్ మరియు హెర్రింగ్ అనే చేపలలో ఎక్కువగా ఉంటాయి. అక్రోటుకాయ (వాల్నట్స్), బాదం మరియు అవిస గింజలలో ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి.


వ్యాయామాలు:
మంచి  కొలెస్ట్రాల్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి వ్యాయామం చాలా ఉత్తమమైనవి . ఎవరైతే తరుచుగా వ్యాయామం చేస్తారో వారిలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ యొక్క శాతం పెరుగుతుంది. ఇలాంటి లిపోప్రొటీన్ లు రక్తంలో కలిసిన చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. ఎలాంటి వ్యాయామాలు చేసిన అవి కనీసం 10 నుంచి 20 నిమిషాల వరకు ఉండాలి. అది నడవడం కావచ్చు, నీటిలో ఈదడం కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఏ ఇతర వ్యాయామం అయిన కావచ్చు. ఏరోబిక్ వ్యాయామాలు చేసేవారు కచ్చితంగా 30 నిమిషాల పాటు, వారానికి కనీసం ఐదు రోజులైనా చేయడం తప్పనిసరి. 


మందులు, మాత్రలు:
తగిన మందులు వాడటం వలన రక్తంలోని  కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వైద్యుడి సలహా మేరకి మాత్రమే వేసుకోవాలి. నియాసిన్ మరియు మొక్కల స్టిరాల్స్ వంటి మందులు వాడాలి. నియాసిన్ వలన రక్తంలో చెక్కర శాతం పెరిగి, ఎర్రబారడం జరుగుతుంది కావున నియాసిన్ తీసుకోవడం ప్రమాదంతో కూడుకున్నది. కావున నియాసిన్ తీసుకునేవారు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ప్రతిరోజూ ప్లాంట్ స్టిరాల్స్ 2 గ్రాముల మోతాదులో నారింజ రసంతో కాని, వనస్పతితో కాని తీసుకోవడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని 15 శాతం వరకు తగ్గించవచ్చు.


Also Read: Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్​గా మారిన బొమ్మలు అమ్మే యువతి!


Also Read: CM Jagan: మహిళలకు 51శాతం పదవులిచ్చిన ఏకైక రాష్ట్రం AP: సీఎం జగన్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook