Viral Girl Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్​గా మారిన బొమ్మలు అమ్మే యువతి!

Viral Girl Trending News: ఇదసలే సోషల్ మీడియా జమనా. ఎప్పుడు నెటిజన్లకు ఏది నచ్చుతుందో చెప్పలేం. ఎవరి దశను ఎలా మారుస్తుందో అంచనా వేయలేం. అలాగే కేరళకు చెందిన ఓ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది ఓ సంఘటన. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 10:57 PM IST
  • సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్​
  • రాత్రికి రాత్రే మోడల్​గా మారిన బొమ్మలు అమ్మే యువతి
  • ఫొటోగ్రాఫర్ రూపంలో యువతికి అదృష్టం
Viral Girl Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్​గా మారిన బొమ్మలు అమ్మే యువతి!

Viral Girl Trending News: రేణూ మండల్ అనే మహిళ గుర్తుండే ఉంటుంది. రైల్వే ఫ్లాట్ ఫాంపై పాటలు పాడుకునే ఆమెను రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలబ్రెటీని చేసింది. బాలీవుడ్ లో సింగర్ గా అవకాశం కూడా కల్పించింది. అలాగే ఈ మధ్య కచ్చా బాదమ్ సింగర్ కూడా ఎంతలా ఫేమస్ అయ్యాడో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే సోషల్ మీడియా ఓ బెలూన్లు అమ్ముకునే అమ్మాయి దశతిరిగేలా చేసింది. ఓ జాతరలో ఫోటో గ్రాఫర్ తీసిన స్టిల్ విపరీతంగా వైరల్ కావడంతో ఇప్పుడామె మోడల్ అవతారమెత్తింది.

కేరళలో సెటిలైన రాజస్థానీ..

రాజస్థాన్​కు చెందిన కిస్బూ కుటుంబం కేరళలో సెటిలయ్యింది. రోడ్ల దగ్గర, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకోవడం వారి వృత్తి. ఇటీవల అండలూర్ కవూలో జాతరకు కూడా బెలూన్లు అమ్ముకోవడానికి వెళ్లింది కిస్బూ. అక్కడ వెడ్డింగ్ ఫోట్ గ్రాఫర్ అర్జున్ కృష్ణన్ కెమరాకు చిక్కింది.

సరదాగా ఫోటోలు తీస్తున్న అర్జున్.. అనుకోకుండా బెలూన్లు అమ్ముకుంటున్న కిస్భూను క్లిక్ మనిపించాడు. ఆఫోటో అద్భుతంగా రావడంతో ఆమె తల్లి పర్మిషన్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో ఆమెతో కొన్ని ఫోటో షూట్లు చేయించాడు. ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న మోడల్ కు తగ్గకుండా కిస్బూ ఇచ్చిన లుక్స్​తో అవికూడా విపరీతంగా షేర్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కిస్బూ ఫేమస్​ మోడల్​గా మారిపోయింది. తన జీవితాన్ని మార్చిన అర్జున్ కృష్ణన్ కు కిస్భూ ధన్యవాదాలు చెబుతోంది.

Also read: Nandi Drinking Milk: ఓ మై గాడ్​.. శివాల‌యంలో పాలు తాగుతున్న నంది విగ్రహం! ఆలయానికి పోటెత్తిన భక్తులు!!

Also read: Viral Video: ప్రపంచాన్ని కదిలిస్తున్న ఉక్రెయిన్ చిన్నారి పాట, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం FacebookTwitter

Trending News