Foods For Women: ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి కావాల్సిన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. మహిళల్లో పోషకాహార లోపం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం తెలుసుకుందాం..మహిళలు ఎక్కువగా క్యాల్షియంతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఎముకల సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా వయస్సు ముప్పై దాటిని వారు క్యాల్షియంతో కూడిన పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. 


అలాగే ఐరన్‌ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తహీనత సమస్యలు తలెత్తకుండా ఉంటారు. ఐరన్‌ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గర్బణీ స్త్రీలు ఐరన్‌ తో కూడిన పదార్థాలు తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రోటిన్‌ కంటెంట్‌ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. దీని శరీరం దృఢంగా ఉంటుంది. ఫైబర్‌ తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.


ఫైబర్‌తో కూడిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్దంతో , గ్యాస్‌ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఫైబర్‌ కంటెంట్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఫైబర్‌ తీసుకోవడం వల్ల దృఢంగా కూడా ఉంటారు. 


విటమిన్‌ సి కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం మెరుగుగా కనిపిస్తుంది. అలాగే విటమిన్ సి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


ఆకు కూరలు, పండ్లు తీసుకోవడం వల్ల అనేక రకమైన పోషకాలు లభిస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.  


Also Read Badam Milk: బాదం పాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచివి, నష్టాలు కూడా ఉన్నాయా



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter