Foods to avoid in the morning : మామూలుగానే మనం చిరుతిండ్లకు దూరంగా ఉండటం మన ఆరోగ్యానికి మంచిది. మరి ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని వీలైనంతవరకు నియంత్రించటం మంచిది. ముఖ్యంగా క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆ రోజు మొత్తం ఇబ్బందిపడాల్సి ఉంటుంది. పరకడుపున ఎంత అపోషకాహారం తీసుకుంటే అంత మంచిది.  చెడు ఆహారం రోజంతా మనకి శక్తి ఇవ్వకుండా జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో మంచి పోషక ఆహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఉదయాన్నే లేవగానే తినకూడని పదార్థాలు ఏంటో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవ్వు పదార్ధాలు..


ఉదయాన్నే కొవ్వు పదార్థాలు తినడం అసలు మంచిది కాదు. దానివల్ల జీర్ణసమస్యలు ఎక్కువవుతాయి. కాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఉదయం లేవగానే కొవ్వు పదార్థాలు తినడం మానుకోవాలి. 


చక్కెర:


చక్కెరలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఉదయం మనం తీసుకునే ఆహారంలో చక్కర ఉండకపోవడం మంచిది. ఖాళీ కడుపుతో పండ్ల రసాలు కూడా తీసుకోకూడదు. అందులో ఉండే చక్కెర మోతాదు కూడా ఆరోగ్యానికి హానికరం. ఇక చక్కెర ఎక్కువగా ఉండే కేకులు, స్వీట్లు వంటివి తినడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అందులో ఉండే క్యాలరీల వల్ల శక్తి తగ్గిపోయి నీరసపడిపోతారు. 


నూనెలో వేయించిన ఆహారాలు:


పొద్దు పొద్దున్నే ఖాళీ కడుపుతో నూనెలో వేయించిన ఆహారం తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వేయించిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. 


సిట్రస్ పండ్లు:


ఉదయం లేవగానే వేడినీళ్లలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగడం మంచిదే. కానీ వేరే సిట్రస్ పండ్లు మాత్రం ఖాళీ కడుపుతో తినకూడదు. సిట్రస్ లో ఉండే యాసిడ్ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు లోపలికి వెళ్తే ఎసిడిటీ వస్తుంది.


కృత్రిమ స్వీటెనర్లు ఉండే ఆహారం :


స్వచ్ఛమైన పలతో ఇంట్లో మనం చేసుకునే పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. బయట పెరుగు సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పెరుగులో కూడా ఆర్టిఫిషియల్ స్వీటెనర్ కలిపి మరీ అమ్ముతూ ఉంటారు. అలాంటివి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఖాళీ కడుపున ఇవి అసలు తినకూడదు.


Also Read: Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు


Also Read: Narendra Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter