Fruits Facts: అన్నానికి బదులు రోజు పండ్లు తింటే ఏం జరుగుతుంది?
Fruits Facts In Telugu: పండ్లను ప్రతి రోజు తినడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా శరీర బరువుతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Fruits Facts In Telugu: ప్రతిరోజు అన్నానికి బదులుగా పండ్లను తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పండ్లు ఎంతగానో సహాయపడతాయి. అయితే చాలామంది పండ్లను ఎక్కువగా తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు. నిజానికి పండ్లను రోజు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? అయితే ప్రతిరోజు పండ్లను తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.. ఎందుకంటే పండ్లలో శరీరానికి కావాల్సిన సహజ చక్కెర అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ప్రతిరోజు పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
గుండె సమస్యల నుంచి విముక్తి:
పండ్లలో పొటాషియంతో పాటు మెగ్నీషియం అధిక మోతాదులో లభిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రించే వివిధ రకాల ఖనిజాలు కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి రోజు పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు గుండెపోటు సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు రోజు పండ్లను తినడం చాలా మంచిది.
మెదడు ఆరోగ్యం కోసం:
ముఖ్యంగా ప్రతిరోజు పండ్లను తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి రోజు అన్నానికి బదులుగా వీటిని తింటే మెదడు కణాలు ఆరోగ్యంగా మారుతాయి. అంతేకాకుండా ఎలాంటి వయసులోనైనా అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.
కంటి ఆరోగ్యానికి..:
పండ్లలో విటమిన్ ఏ తో పాటు సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రోజు పండ్లను తినడం వల్ల కంటి ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. అంతేకాకుండా గ్లాకోమా వంటి కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇప్పటికే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారు రోజూ ఉదయాన్నే అల్పాహారంలో భాగంగా పనులను తీసుకోవడం ఎంతో మంచిది.
ఎముకల ఆరోగ్యం:
కొన్ని పనులలో క్యాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు పండ్లను తినడం వల్ల శరీరానికి విటమిన్ డితో పాటు క్యాల్షియం అధికంగా అందుతుంది. దీని కారణంగా ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధులు తొలగిపోతాయి. అలాగే వాటి దృఢత్వం కూడా విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత సమస్య:
పండ్లలో ఐరన్ పరిమాణం అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు పండ్లు తినడం వల్ల రక్తహీనత వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇప్పటికే శరీరంలో రక్తం లోపం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు రోజు పండ్లను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
క్యాన్సర్ కణాల నియంత్రణ:
రోజు పండ్లు తినడం వల్ల శరీరానికి ఫ్లేవనాయిడ్స్, కారోటినాయిడ్స్ వంటి యాంటీ క్యాన్సర్ లక్షణాలు లభిస్తాయి. దీనివల్ల రొమ్ముకి క్యాన్సర్, ఇతర క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్ కణాలను నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.