Fruits For Good Sleep: రాత్రి ఒంటిగంట అయినా నిద్ర పట్టడం లేదా? ఈ పండ్లు తింటే చాలు రోజు పదింటికే పడుకుంటారు!
Fruits For Good Sleep: నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది పండ్లను ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులనుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Fruits For Good Sleep: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో ఒత్తిడి పెరిగిపోయి నిద్రలేని సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేని సమస్యల కారణంగా ఉదయం పూట నిద్రలేచేందుకు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు దీని కారణంగా వ్యాయామాలు చేయడం కూడా మానుకుంటున్నారు. ప్రతిరోజు శరీరానికి సరైన వ్యాయామాలతో పాటు నిద్ర కూడా అంతే ముఖ్యం.. కాబట్టి మనిషి ఆరోగ్యం గా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవడం ఎంతో మంచిది.
కొంతమందిలో ఒత్తిడి కారణంగా ఎన్ని చిట్కాలు పాటించిన సరిగా నిద్రపోవడం లేదు. అయితే ఇలాంటి వారికోసం ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్ల గురించి తెలియజేయబోతున్నాం. ఈ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ అరటి పండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈరోజు అరటి పండ్లతో పాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్ తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ కూడా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్ ను తీసుకోవాల్సి ఉంటుంది. పైనాపిల్లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్ ని తీసుకోవడం వల్ల కండరాలు కూడా మెరుగుపడతాయి. నిద్ర సమస్యలతో బాధపడేవారు కివి పనులను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయిలను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter