Garlic Benefits: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు కానీ ఉల్లి బదులు వెల్లుల్లి చేర్చుకోవల్సి వస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లిని ఔషధ మూలిక అని పిలుస్తారు. ముఖ్యంగా చలికాలంలో వెల్లుల్లితో చాలా లాభం కలుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరం ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండేందుకు డైట్ అనేది కీలకం. అదే సమయంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా ఉండాలి. తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి. ఇందులో ముఖ్యమైంది వెల్లుల్లి. వెల్లుల్ని అనేది శరీరాన్ని అనేక వ్యాధుల్నించి కాపాడుతుంది. రోజూ క్రమం తప్పకుండా వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్య నుంచి చాలా వరకూ ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లిలో ఉండే వార్మింగ్ ప్రభావం కారణంగా జలుబు, దగ్గు సహా ఫ్లూ వంటి వ్యాధుల్నించి విముక్తి పొందవచ్చు. శీతాకాలంలో వెల్లుల్లితో అధిక ప్రయోజనాలు కలిగినా అన్ని సీజన్లలో సేవించాలంటున్నారు. 


వెల్లుల్లిని రోజూ క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో అద్భుతంగా దోహదపడుతుంది. వెల్లుల్లి వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. రోజూ ఉదయం పరగడుపున 2-3 వెల్లుల్లి రెమ్మల్ని నమిలి తినగలిగితే రక్తపోటును అద్భుతంగా నియంత్రణలో ఉంచవచ్చు. 


పచ్చి వెల్లుల్లి తినలేకపోతే వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా మంటలో కాల్చి తినవచ్చు. లేదా తెనెలో కలుపుకుని తినవచ్చు. లో బీపీ ఉన్నవారు మాత్రం వెల్లుల్లి తినకూడదు. 


Also read: YCP 4th List: వైసీపీ నాలుగో జాబితా, రాజమండ్రి నుంచి వివి వినాయక్, గుంటూరు లేదా నంద్యాల నుంచి అలీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook