Get Rid of Blackheads: ముఖంపై రంధ్రాల వల్ల నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఇవి చూడ్డానికి ముఖం అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. వీటిని తగ్గించడానికి వేల రూపాయల్లో ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ కి వెళ్తారు. అయితే కొన్ని హోమ్ రెమెడీస్ తో సహజసిద్ధంగా నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముల్తానీ మట్టి ఆరంజ్ పీల్..
ముల్తానా మట్టి ఆరెంజ్ ఫీల్ పొడిని కలిపి నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. ఇది ఒక పది నిమిషాలు అయిన తర్వాత నీటితో ముఖం పై స్క్రబ్ చేస్తున్నట్టు రుద్దుకోవాలి. ముల్తానా మట్టికి ముఖంపై ఉన్న అదనపు ఆయిల్ గ్రహించే గుణాలు ఉంటాయి. ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి ఉంటుంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది, స్కిన్ టెక్స్చర్ ని పెంచి నల్ల మచ్చలను తగ్గిస్తుంది.


బేకింగ్ సోడా..
బేకింగ్ సోడాకు తగిన నీళ్లు కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని సున్నితంగా ముఖంపై అప్లై చేసి రుద్దుకోవాలి ముఖ్యంగా నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేసుకోవాలి కొద్దిసేపు ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగితే సరిపోతుంది.


ఇదీ చదవండి: గులాబీనీటితో మెరిసే అందం మీ సొంతం.. ముఖం కాంతివంతమవుతుంది.


షుగర్ నిమ్మకాయ..
చక్కెర నిమ్మరసం కలిపి నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖం సాధారణ నీటితో కడగాలి షుగర్ కి ఎక్స్‌ఫొలియేషన్ గుణాలు ఉంటాయి. నిమ్మరసం స్కిన్ ని మెరిపిస్తుంది.


బొప్పాయి, పాలు..
బొప్పాయి, పాలు, లెమన్ జ్యూస్, బియ్యం పిండి కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీన్ని ఫేస్ కి స్క్రబ్ మాదిరి రుద్దుకొని పది నిమిషాల తర్వాత ముఖం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బొప్పాయిలో పప్పెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనికి ముఖంపై నల్లమచ్చలను  మాయం చేసే గుణం ఉంటుంది. 


ఇదీ చదవండి: తెల్ల వెంట్రుకలకు చెక్ పెట్టే కరివేపాకు ఆయిల్ ఇలా తయారు చేసుకోండి


దాల్చిన చెక్క, తేనె..
ఒక టేబుల్ స్పూన్ తేనెలో 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి పేస్ట్ మాదిరి తయారు చేసుకుని నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేసుకోవాలి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దాల్చిన చెక్క బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగు చేస్తుంది. ఈ రెండూ ముఖంపై నల్లమచ్చలకు చెక్‌ పెడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter