Get Rid Of Pimple And Dark Spots: మచ్చలేని చర్మం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే ఖరీదైన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంత మంది రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ కూడా అతిగా వినియోగిస్తూ ఉంటున్నారు. అయితే వీటిని తరచుగా వినియోగించడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు వస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌కి బదులుగా పలు కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల సులభంగా చర్మంపై మొటిమల నుంచి విముక్తి కలుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది దుమ్ము, కాలుష్యం కారణంగా కూడా మొటిమల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఫ్రిజ్‌లో ఉంచిన కొన్ని వస్తువులను వినియోగించాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లో  పెట్టిన పెరుగుతో పాటు, వీటిలో కొన్ని పదార్థాలను కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ హోం రెమెడీస్‌ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


పెరుగుతో ఫేస్ ప్యాక్:
ఫ్రిజ్‌లో ఉంచిన పెరుగును ఫేస్‌ ఫ్యాక్‌లా తయారు చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫేస్‌ అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి..శుభ్రం చేసుకుంటే ముఖంపై మెరుపు పెరుగుతుంది. అంతేకాకుండా మొటిమల సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 


రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ కూడా చర్మానికి ప్రభావంతంగా పని చేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫేస్‌ ఫ్యాక్‌ తయారు చేయడానికి ముందుగా పెరుగు తీసుకోవాలి..అందులోనే రోజ్ వాటర్ మిక్స్ చేసి 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా మారిన తర్వాత ఫేస్‌కి అప్లై చేస్తే సులభంగా మొటిమల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook