Snakes in rainy season: సాధారణంగా ఎక్కడైనా ఒక పాము కనిపించిందంటే చాలు గుండె హడాలెత్తిపోతుంది.  అలాంటిది వర్షాకాలంలో ఇక ఆ పాముల బెడద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎక్కడైనా చెత్తగా అనిపించిందంటే చాలు.. చిన్న పాము అయినా కనిపిస్తూ అందరిని భయపెడుతూ ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి ఇలాంటి పాముల బెడద ఎక్కువగా వర్షాకాలంలోనే ఉంటుంది.. మరి వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ పాముల బెడద ఉండదు అని చెబుతున్నారు నిపుణులు. ఇంటి చుట్టూ కొన్ని మొక్కలు నాటితే పాములు ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించవు అని చెబుతున్నారు. మరి ఆ మొక్కలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..


పాము మొక్క: 


ఈ మధ్యకాలంలో ఈ మొక్క బాగా ప్రావీణ్యం పొందింది. ఈ మొక్కను మీరు ఇంట్లో కుండీలో పెట్టి కిటికీలో లేదా వరండాలో ఉంచితే.. దీని వాసన వల్ల పాములు, తేళ్లు మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు. మీ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది. 


నిమ్మ గడ్డి మొక్క: 


సాధారణంగా నిమ్మగడ్డి.. ఇంటి ఆవరణలో లేదా కాంపౌండ్ లోపల కుండీలలో పెంచినట్లయితే.. దోమలు నివారించవచ్చు అని చెబుతారు. కానీ దీని నుంచి వెలువడే వాసన పాములను కూడా హడలెత్తిస్తుందట. మీరు మీ ఇంటి చుట్టుపక్కల లేదా ఇంటి లోపల ఈ మొక్కలను పెంచినట్లయితే దీని వాసనకు పాములు రావు. 


వేప నూనె: 


వర్షాకాలంలో ప్రత్యేకించి ఇంటి బయట.. నేలపైన వేప నూనెను పిచికారీ చేస్తే.. దీని వాసనకు దోమలతో.. పాటు పాములు కూడా దూరం అవుతాయి. 


తులసి మొక్క: 


హిందూ శాస్త్రం ప్రకారం తులసి మొక్కకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ..ఈ తులసి మొక్కను దైవంగా భావించడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ తులసి మొక్క పాములను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. మీరు మొక్కలను కుండీలో పెట్టి ఇంటి తలుపు కిటికీ లేదా బాల్కనీలో.. పెడితే పాములు చేరవు అని పెద్దల నమ్మకం. 


కాక్టస్ మొక్క..


ఒక కుండీలో ఈ మొక్కను పెంచి.. ఇంటి బయట లేదా వరండాలో ఉంచితే దీని చుట్టూ పాములు చేరవు.. దీని వాసనకు పాములు రావట..


ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వర్షాకాలంలో పాముల బెడద నుండి తప్పించుకోవచ్చు.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి