Ginger Tea Vs Cardamom Tea In Telugu: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా టీని తాగుతూ ఉంటారు. నిజానికి ప్రతి రోజు టీని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నా అతిగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ టీని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే చాలా మంది ప్రతి రోజు రకరకాల టీలు తాగుతూ ఉంటారు. ఇందులో ఎక్కువగా అల్లం టీ, యాలకుల టీలు తీసుకుంటూ ఉంటారు. వీటిని రెండింటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండు టీలలో అనేక తేడాలు ఉన్నాయి. అవేంటో ఈ రెండింటి తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లం టీ vs యాలకుల టీ:
అల్లం టీకి సంబంధించిన రుచి వివరాల్లోకి వెళితే, ఇది కొద్దిగా కారంగా, అన్ని టీల కంటే ఎంతో వేడిగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ టీ రక్త ప్రసరణను కూడా ఎంతో సులభంగా మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఈ టీని తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 


యాలకుల టీ రుచికి ఎంతో తీపి, సువాసనభరితంగా ఉంటుంది. ఈ టీ జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు నోటి దుర్వాసనను తగ్గించి, ఒత్తిడిని కూడా సులభంగా తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ టీలో కెఫిన్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఇక అల్లం టీలో కాస్త కెఫిన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అల్లం టీలో వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే కొన్ని మూలకాలు గ్యాస్‌ వంటి సమస్యలను పెంచుతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అల్లం టీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉంది. యాలకుల టీ మాత్రం ఆసియా, మధ్యప్రాచ్యంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇక అల్లం టీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇక యాలకుల టీలో యాంటీఆక్సిడెంట్లు, మాంగనీస్, పొటాషియం కలిగి ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు తక్షణ శక్తిని ఇచ్చేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే యాలకుల టీ విశ్రాంతిని అందిస్తుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి