Goat Milk Benefits: మేకపాలలో ఉన్న లాభాలు తెలిస్తే.. ఆవు, గేదె పాలు తాగడం వెంటనే మానేస్తారు..
Goat Milk Benefits: సాధారణంగా ప్రతిరోజు మనం పాలు తాగుతాం అవి ఎక్కువ శాతం పాకెట్ పాలు ఆవు పాలు లేదా గేద పాలు తాగే అలవాటు ఉంటుంది అయితే మేకపాలు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి
Goat Milk Benefits: సాధారణంగా ప్రతిరోజు మనం పాలు తాగుతాం అవి ఎక్కువ శాతం పాకెట్ పాలు ఆవు పాలు లేదా గేద పాలు తాగే అలవాటు ఉంటుంది అయితే మేకపాలు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం.
సులభంగా జీర్ణం..
మేక పాలు తాగడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది కడుపుపై ప్రభావం చూపించదు. ఇందులో ఎన్నో రకాల ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మందికి ఆవు పాలు తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి కానీ మేకపాలలో మంచి గుణాలు కలిగి ఉంటాయి.
ఖనిజాలు..
మేకపాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎన్నో పోషాకాలు ఉంటాయి. మేకపాలు పలుచగా ఉంటాయని తక్కువగా అంచనా వేయకండి. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది మన శరీరాన్ని బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు మేకపాలలో విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఫాస్పరస్ పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.
ఇమ్యూనిటీ బూస్ట్..
మేక పాలలో మన శరీరానికి కావలసిన ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి విటమిన్ ఏ ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. సెలీనియం యాంటీ ఆక్సిడెంట్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. మేకపాలు తరచూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ నాచురల్ గా బలపడుతుంది.
ఇదీ చదవండి: అంజీర్ పండు నానబెట్టిన నీళ్లతో 5 మిరాకిల్ బెనిఫిట్స్..
చర్మ ఆరోగ్యం..
ఇది ముఖంపై మచ్చ లేకుండా మృదువైన చర్మం కావాలంటే మేకపాలను మీ డైట్ లో చేర్చుకోండి ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎన్నో ఖనిజాలు ఉంటాయి ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ మీ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి మృదువుగా ఉంచుతుంది. కొంతమంది మేకపాలు ఉపయోగించిన పాలు ఇతర పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు. దీనివల్ల చర్మంపై ఉండే దురదలు తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యం..
మేకపాలు కూడా కీలక పాత్రను పోషిస్తుంది ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో పొటాషియం ఉండటం వల్ల ఆ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
ఇదీ చదవండి: పరగడుపున అల్లం రసం తాగితే ఏమవుతుందో తెలుసా?
జీర్ణ క్రియ..
మేకపాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలకు చెక్ పెడుతుంది మేకపాలల్లో కడుపు సమస్యలు రాకుండా నివారిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఇది కడుపులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి