Wear Gram Flour Face Packs to make your face glow like Rashmika Mandanna: 'శనగ పిండి'ని భారతీయ వంటలో ప్రధానంగా ఉపయోగిస్తారు. శనగ పిండితో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. శనగ పిండి కేవలం వంటలలో మాత్రమే కాకుండా.. చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శనగ పిండిలో ఉండే గుణాలు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తాయి. మొటిమలు, ముడతలు, టానింగ్ మరియు చర్మంపై ఉండే నూనెను తొలగించే శక్తి దీనికి ఉంది. శనగ పిండితో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి రాసుకుంటే.. చర్మ సమస్యలన్నీ ఇంట్లో కూర్చొని మటుమాయం చేసుకోవచ్చు. శనగ పిండిని ఉపయోగించి చాలా రకాలుగా ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టొమాటో-శనగ పిండి ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మపు ముడతలు తొలగిపోతాయి. టొమాటో చర్మానికి చాలా మేలు చేస్తుంది. టొమాటో గుజ్జును శనగ పిండితో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి15 నిముషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వాడకంతో ముఖం మెరుగవ్వడమే కాకుండా ముడతల సమస్య కూడా దూరమవుతుంది.


కలబంద-శనగ పిండి ఫేస్ ప్యాక్:
శనగ పిండిని కలబందతో కలిపి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి. అలోవెరా జెల్‌ను శనగ పిండి మరియు నీటితో కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి.. 10-15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దాంతో చర్మంపై మెరుపు ఉంటుంది.


నిమ్మ-శనగ పిండి ఫేస్ ప్యాక్:
శనగ పిండిలో నిమ్మరసం కలయిక వల్ల చాలా మేలు జరుగుతుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి శనగ పిండిలో కొద్దిగా నిమ్మ, పెరుగు, పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచి.. నీటితో ముఖాన్ని కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల టానింగ్ మరియు మచ్చల సమస్య తొలగిపోయి చర్మం తలతల మెరుస్తుంది.


ముల్తానీ-శనగ పిండి ఫేస్ ప్యాక్:
శనగ పిండి మరియు ముల్తానీ మట్టి రెండూ చర్మానికి మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేస్తారు. ముల్తానీ మట్టిలో సగం పరిమాణంలో శనగ పిండి తీసుకుని.. అందులో రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత నీతితో కడిగేయాలి. మీరు ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా వేసుకుంటే.. మీ ముఖం హీరోయిన్ రష్మిక మందన్నలా మెరిసిపోతుంది. 


Also Read: Hair Care Tips: బొప్పాయిని ఇలా జుట్టుకు రాసుకుంటే.. దీపికా పదుకొనె లాగా మెరిసే జుట్టు మీ సొంతం!  


Also Read: Best Mircro SUV Cars: టాటా పంచ్ కంటే ఈ మైక్రో ఎస్​యూవీ కార్ అదుర్స్.. 6 మంది కూర్చోవచ్చు! ధర 6.18 లక్షలు మాత్రమే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.