Side effects of Green Tea: గ్రీన్ టీ తాగడం తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే గుణాలు శరీరానికి పోషకాలను అందించి అనారోగ్య సమస్యలు రాకుండా కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీలో విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ టీ పురుషుల కంటే స్త్రీల చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  అంతేకాకుండా అతిగా తాగడం వల్ల కూడా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వీరు గ్రీన్‌ టీలను తాగకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరు అసలు గ్రీన్ టీ తాగకూడదు:


గర్భిణీ స్త్రీలు:
గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే కాటెచిన్ సమ్మేళనం గర్భధారణకు ముందు తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. అంతేకాకుండా పుట్టబోయే పిల్లలకు కూడా హాని కలిగించవచ్చు.


కంటిశుక్లం సమస్యలతో బాధపడేవారు:
కంటిశుక్లం, ఇతర కంటి సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీని తాగకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. గ్రీన్‌ టీ కళ్లకు చాలా హానికరమని, కాబట్టి ప్రతి రోజూ తాగడం వల్ల కళ్లపై ఒత్తిడి పడి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే ఛాన్స్‌ ఉంది.


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!


జీర్ణక్రియ సమస్యలున్నవారు:
జీర్ణక్రియ సమస్యలతో  బాధపడేవారు గ్రీన్ టీ తాగడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే టానిన్ అనే మూలకం కడుపులో యాసిడ్‌ను పెంచడానికి సహాయపడుతుంది. దీని కారణంగా అపానవాయువుకు కారణమవుతుంది. కాబట్టి అతిగా గ్రీన్‌ టీలను తాగకపోవడం చాలా మంచిది.


రక్తహీనత సమస్యలున్నవారు:
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం సమస్యలు పెరిగే అవకావశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అతిగా గ్రీన్‌ టీ తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు రక్త హీనత, రక్త పోటు సమస్యలకు దారీ తీయోచ్చు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook