Grey Hair Control Herbs: తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు అయితే ఎన్నో రెమెడీలను కూడా వీటి కోసం ప్రయత్నిస్తుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తిలో రసాయనాలు విపరీతంగా ఉంటాయి. త్వరగా ఫలితాలను ఇవ్వవు దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని మూలికలతో  సులభంగా వైట్ హెయిర్ సమస్యకు చెక్కు పెట్టవచ్చు అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్లాక్ టీ..
బ్లాక్ టీలో టానిన్లు ఉంటాయి. ఇవి తెల్ల జుట్టును నలుపుదనంలోకి సహజసిద్ధంగా మార్చేస్తాయి. అంతేకాదు బ్లాక్ టీ ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన మెరుపు కూడా అందుతుంది. హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారిస్తుంది. జుట్టును న్యాచురల్ గా బ్లాక్ చేసే విధానంలో బ్లాక్ టీ ఇది ప్రభావంవంతమైన రెమెడీ. ఇది జుట్టు నాచురల్ నలుపుదనం తిరిగి తీసుకువస్తుంది.


రోజ్మెరీ..
రోజ్మెరీ కూడా ఒక అద్భుతమైన మూలిక. ఇది స్కిన్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు కలుగుతాయి. ఇది బ్లడ్ సర్కులేషన్ మెరుగు చేస్తుంది. కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీంతో జుట్టు మందంగా అందంగా తయారవుతుంది.


హెన్నా..
హెన్నా కూడా విపరీతంగా జుట్టు సమస్యకు చెక్‌ పెడుతుంది. చాలామంది మహిళలు హెన్నా ను ఉపయోగిస్తారు. ఇది నాచురల్ గా నలుపుదనంలోకి మార్చేస్తుంది. దీంతో జుట్టు నాచురల్ గా మెరుస్తుంది ఆ బలంగా మారుతుంది దింట్లో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.


ఉసిరి..
ఉసిరి కూడా జుట్టుకు మంచి కండిషన్ అందిస్తుంది. ఇది జుట్టును సహజ సిద్ధంగా నలుపుదనంలోకి మారుస్తుంది. ఉసిరిలో సహజసిద్ధంగా నలుపుదరంలోకి మార్చే గుణాలు ఉంటాయి. తరతరాలుగా ఉసిరిని హెయిర్ ఫాల్ సమస్యకు జుట్టు బలపరచడంలో వాడుతున్నారు.


సేజ్ ఆకులు..
సేజ్‌ ఆకుల్లో కూడా నేచురల్‌గా నలుపుదనంలోకి మార్చే గుణం ఉంటుంది. దీన్ని తరచుగా హెయిర్ కేర్ లో యాడ్ చేసుకోవటం వల్ల తెల్లజుట్టు సహజసిద్ధంగా నలుపు రంగులోకి మారుతుంది. వారంలో కనీసం ఒక్కరోజు అయినా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.


 బృంగరాజ్..
 ఈ సహజ సిద్ధమైన మూలిక ప్రతి షాంపు నూనె లో అందుబాటులో ఉంటుంది. జుట్టుకు కుదుళ్ల నుంచి పోషకాలను అందిస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా జుట్టు త్వరగా తెల్లబడకుండా బృంగరాజ్ కాపాడుతుంది.


ఇదీ చదవండి: జుట్టు ఆరోగ్యంగా పెంచే 5 సహజ సిద్ధమైన వంటింటి వస్తువులు ఇవే..


కొబ్బరికాయ..
కొబ్బరికాయను సౌత్ ఇండియాలో విపరీతంగా ఉపయోగిస్తారు. ఇందులో నేచురల్ గా కూలింగ్ గుణాలు ఉంటాయి. జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నలుపుదనంలోకి మారుతుంది జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారుతుంది.


మందార..
మందారాలను నీళ్లలో నానబెట్టి మిక్సీ పట్టుకొని చుట్టూ అంతటికీ అప్లై చేయాలి ఇది కూడా జుట్టును నాచురల్ గా నలుపు రంగులోకి మారుస్తుంది.


నువ్వులు..
నువ్వుల్లో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు నలుపు రంగులోకి మారకుండా కాపాడుతుంది నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కల్పిస్తాయి నువ్వుల నూనెతో కలపాలి అప్లై చేయాలి.


ఇదీ చదవండి: పెరుగుతున్న దోమలు.. మీ పిల్లల్ని 6 విధాలుగా  రక్షించుకోండి..


సహదేవి..
ఈ మూలిక ఎక్కువగా బయటకు పేరు వినిపించదు. అయితే ఇది ఆయుర్వేదిక్ లో విపరీతంగా ఉపయోగిస్తారు ఇది కూడా జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది యాంటీ డ్యాండ్రప్‌గా పనిచేస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter