Hair Blacken tips: సహజసిద్ధంగా జుట్టు నల్లబడేందుకు ఇలా చేయండి, ఆ చిట్కాలేంటి
Hair Blacken tips: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య జుట్టు తెల్లబడటం. వయస్సుతో నిమిత్తం లేకుండా జుట్టు నెరిసిపోతుండటం ఆందోళన రేపుతోంది. ఈ క్రమంలో కొన్ని సులభమైన చిట్కాలు ట్రై చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Hair Blacken tips: ఆధునిక పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి కారణంగా తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడిపోతోంది. ఈ సమస్యతో యువత చాలా ఇబ్బంది ఎదుర్కొంటోంది. కొన్ని పద్ధతులు పాటిస్తే తెల్లబడిన జుట్టును మళ్లీ సహజసిద్ధంగా బ్లాకెన్ చేయవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
1. స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చర్మానికి, జుట్టుకు రంగు మెలనిన్ రసాయనం వల్ల వస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల మెలనిన్ ఉత్పత్తి చేసే మూల కణాలు తగ్గిపోతున్నాయి.
2. షాంపూలు, కండీషనర్లు పెట్టడం మానివేసి, సహజసిద్ధంగా లభించే శీకాకాయి, కుంకుడు కాయను తలంటు స్నానానికి వాడితే మంచిది. తరచూ ఇండిగో ఆకు చూర్ణం పెట్టడం ద్వారా కూడా నల్లజుట్టు తెల్లబడకుండా ఉంటుంది.
3. కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం కలుపుకుని దాన్ని రోజూ తలకు పూసుకుంటూ ఉండండి. నువ్వుల పేస్టులో బాదం ఆయిల్ మిక్స్ చేసి ఈ పేస్టును కొన్ని రోజుల పాటు తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది.
4. రోజూ కొన్ని బాదంపప్పు, వాల్‌నట్స్ వంటివి రోజూ తీసుకోవాలి. అలాగే పిస్తా కూడా తినాలి. ఉసిరి పొడిలో కాస్త నిమ్మరసం కలుపుకొని, దాన్ని మీరు పేస్ట్ మాదిరిగా తలకు పట్టించి రెండు గంటల తర్వాత స్నానం చేస్తే జుట్టు నల్లబడే చాన్స్ ఉంది.
Also read: Dengue Cases: డెంగ్యూ కేసుల ముప్పుంది, తస్మాత్ జాగ్రత్త, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే చిట్కాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook