వివిధ రకాల కారణాలతో జుట్టు రాలడం అధికమౌతోంది. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ ఓ పూవుతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేశాల సంరక్షణ, జుట్టు రాలకుండా నియంత్రించడం ప్రధాన సమస్యలు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు, ఆయిల్స్ వాడినా ప్రయోజనం కన్పించదు. ఫలితంగా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందేందుకు మందారపూలు మంచి ప్రత్యామ్నాయం కాగలవు. మందార పూలు జుట్టు రాలకుండా నియంత్రించగలవు. అంతేకాకుండా..కేశాలు మరింత దట్టంగా, నల్లగా మారేందుకు దోహదపడతాయి.


మందారపూలతో హెయిర్ మాస్క్


కేశాలు మరింత దట్టంగా, నల్లగా మారేందుకు మందార పూలతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుని రాసుకోవాలి. ముందుగా మందారపూలతో పేస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఇందులో కొద్దిగా ఉసిరి పౌడర్ కలపాలి. కొద్దిగా నీళ్లు వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుచ్చిళ్లకు రాసి ఓ అరగంట ఉంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


మందారపూలతో షాంపూ


జుట్టులో చాలాసార్లు డస్ట్ పేరుకుపోతుంటుంది. మందారపూల షాంపూ దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం 10-15 మందార పూలు, 5-6 మందార ఆకులు అవసరమౌతాయి. ఈ రెండింటినీ నీళ్లలో వేసి ఉడికించాలి. ఆ తరువాత ఇందులో శెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని ఓ అరగంట ఉంచుకుని..నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


మందారపూలతో నూనె


జుట్టు రాలే సమస్యను నియంత్రించేందుకు మందార నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నూనె రాయడం వల్ల కేశాలు వృద్ధి చెందుతాయి. మందార నూనె తయారీ కోసం ముందుగా మందారపూలను మిక్సీ చేయాలి. ఓ గిన్నెలో కొబ్బరి నూనె వెసి వేడి చేయాలి. ఇందులో మందారపూల మిశ్రమం వేయాలి. ఇప్పుడు మళ్లీ ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. మొత్తం పౌడర్ కరిగేంతవరకూ వేడి చేయాలి. ఆ తరువాత ఓ బాటిల్‌లో ఈ నూనె నింపుకోవాలి. వారంలో రెండుసార్లు రాస్తే మంచి ఫలితాలుంటాయి.


Also read: Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎంత ఉండాలి, ఎలా నియంత్రించాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook