Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎంత ఉండాలి, ఎలా నియంత్రించాలి

Uric Acid: మన శరీరంలో ఏమైనా మార్పులు కన్పిస్తున్నాయంటే..ఎక్కడో ఏదో లోపం లేదా సమస్య ఉన్నట్టే అర్ధం. శరీరంలో ఏది ఎంత మోతాదులో ఉండాలో ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటినా..తగ్గినా సమస్యే.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 11:57 PM IST
Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, ఎంత ఉండాలి, ఎలా నియంత్రించాలి

శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ చాలా కీలకమైంది. యూరిక్ యాసిడ్ పరిమితి దాటితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఏం చేయాలో తెలుసుకుందాం..

శరీరంలో యూరిక్ యాసిడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రణలో ఉండాలి. ఏ మాత్రం పెరగకూడదు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి  7mg/dl ఉండాలి. ఇంతకంటే దాటితే ప్రమాదకరం. కంటి నొప్పి, కాలి వేళ్ల నొప్పి, మోకాళ్ల నొప్పి, మడమ నొప్పి లక్షణాలు కన్పిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి ఉండవచ్చని అర్ధం. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి, నియంత్రించేందుకు తీసుకోవల్సిన డైట్ ఏంటనేది పరిశీలిద్దాం..

కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. కొందరికైతే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశముంది. స్థూలకాయం లేదా కడుపుకు అటూ ఇటూ కొవ్వు పేరుకుపోవడం కూడా యూరిక్ యాసిడ్ కారణం. తరచూ ఆందోళన లేదా ఒత్తిడికి లోనవుతుంటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.

గౌట్ ఆర్ధరైటిస్ అనేది అన్నింటికంటే నొప్పిగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయినప్పుడు ఇది తలెత్తుతుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారపదార్ధాల్లో మార్పులు చేయడమే యూరిక్ యాసిడ్ నియంత్రణకు అత్యుత్తమ మార్గం. జీవనశైలిలో మార్పులు, తరచూ మందులు వాడటం వల్ల తగ్గించుకోవచ్చు.

యూరిక్ యాసిడ్ నియంత్రణకు డైట్

యూరిక్ యాసిడ్ బాధితులు మష్రూమ్, బీన్స్, మటర్, పప్పులు, అరటిపండ్లు, అవకాడో, కివీ ఫ్రూట్, దానిమ్మను సాధ్యమైనంతవరకూ తగ్గించాలి. మీరు తీసుకునే డైట్‌లో ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. ఫ్రైడ్ ఆహార పదార్ధాలు పూర్తిగా తగ్గించాలి. ముఖ్యంగా శాచ్యురేటెడ్ ఫ్యాట్‌కు దూరంగా ఉండాలి. 

యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మీ డైట్‌లో కొన్ని ఆహార పదార్ధాలు చేర్చాల్సి ఉంటుంది. అందులో యాపిల్ సైడర్ వెనిగర్, ఫ్రెంచ్ బీన్స్ జ్యూస్, చెర్రీ, నేరేడు పండ్లు,  లోఫ్యాట్ డైరీ ఉత్పత్తులు, ఎక్కువగా నీరు, ఆలివ్ ఆయిల్ , పింటో బీన్స్  ముఖ్యమైనవి. డైట్ తేడా లేకుండా జాగ్రత్త పడితే యూరిక్ యాసిడ్ సులభంగా నియంత్రించవచ్చు.

Also read: Swimming Benefits: రోజుకో గంట స్విమ్మింగ్, 10 రోజుల్లో స్థూలకాయం మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News