White Hair Problem: ప్రస్తుతం చాలామంది బాధపడేది వైట్ హెయిర్ సమస్యతోనే. రంగులు, గోరింటాకు రాసి రాసి అలసిపోయుంటారు. అందుకే సహజసిద్దమైన పద్ధతిలో ఆ ఆకుల్ని ఉపయోగిస్తే..అద్భుత ఫలితాలుంటాయి. వైట్ హెయిర్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివిధ రకాల ఆహారపు అలవాట్లు, వాతావరణం, కాలుష్యం, పని ఒత్తిడి ఇలా చాలా రకాల కారణాలతో వైట్ హెయిర్ ఓ సమస్యగా మారిపోతోంది. వాతావరణంలో మార్పులతో శరీరంలో కూడా చాలా మార్పులు వస్తుంటాయి. తినే ఆహారం, హార్మోన్స్ అన్నింటికీ కారణం. చిన్నతనంలో ఆయిల్ మాలిష్ వల్ల స్కిన్ సెల్స్ పటిష్టంగా మారుతాయి. ఫలితంగా చర్మం నిగారింపు వస్తుంది. అదే విధంగా హెయిర్ కేర్ కూడా. జుట్టును సంరక్షించుకోకపోతే వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే ప్రకృతిలో విరివిగా లభించే చింతాకులతో వైట్ హెయిర్, హెయిర్ ఫాల్ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు..


ఉసిరి, చింతాకులతో..


ఉసిరి, చింతాకులతో జుట్టుకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనికోసం తాజా ఉసిరి కాయలు, కొన్ని చింతాకులు తీసుకోవాలి. ఉసిరికాయల్ని ముక్కలుగా చేసుకుని..చింతాకులతో కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు జుట్టుకు బాగా రాసుకోవాలి. అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.


చింతాకులు, పెరుగుతో..


పెరుగు, చింతాకులతో మీ జుట్టు సంరక్షణకై ప్యాక్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మీ జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది. దీనికోసం కొన్ని చింతాకుల్ని తీసుకుని పెరుగులో కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి ఓ గంటసేపుంచాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలుంటాయి.


చింతాకులు, మెంతి గింజలతో..


మెంతి గింజలు, చింతాకులతో సైతం జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. దీనికోసం మెంతి గింజల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి..ఉదయం వడకాయాలి. మెంతిగింజలకు చింతాకులు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


Also read: Skin Care Treatment: ఆరోగ్యమైన, కాంతివంతమైన చర్మం కోసం..ఇంట్లోనే ఫేస్‌ప్యాక్ తయారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook