డాండ్రఫ్ అనేది సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కన్పించే సమస్య. చాలామందిలో సీజన్‌తో సంబంధం లేకుండా ఉంటుంది. డాండ్రఫ్ కారణంగా తలలో దురద, జుట్టు బలహీనమై రాలిపోవడం ఇలా ఒకదానివెంట మరో సమస్య ఉత్పన్నమౌతుంది. సమస్య ఎంత తీవ్రమైనా అంతే సులభమైన పరిష్కారం కూడా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేశాలకు, కేశాల కుదుళ్లకు బాదం నూనె రాయడం ద్వారా డాండ్రఫ్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇందులో రెండు వస్తువులు కలిపి రాస్తే డాండ్రఫ్ సమస్యను చిటికెలో దూరం చేయవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఇ, ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్ కేశాలకు నిగారింపు అందిస్తాయి. బాదం నూనెను క్రమం తప్పకుండా మాలిష్ చేయడం వల్ల డాండ్రఫ్ సమస్య తొలగిపోతుంది. 


బాదం నూనెలో కలపాల్సిన పదార్ధాలు


నిమ్మరసం


బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి రాయడం వల్ల డాండ్రఫ్ సమస్య వెంటనే తొలగిపోతుంది. చిన్న గిన్నెలో బాదం నూనె, నిమ్మరసం కొద్దిగా కలుపుకుని కేశాలకు బాగా రాసుకోవాలి. చేతివేళ్లతో నెమ్మదిగా మాలిష్ చేయాలి. ఓ గంట అలా ఉంచి..షాంపూలో తల శుభ్రం చేసుకోవాలి. లేదా మరుసటి రోజు వరకూ ఉంచుకుని అప్పుడు తలస్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కేశుల ఎదుగుదల కూడా బాగుంటుంది. 


తేనె


బాదం నూనె, తేనె, అరటి మిశ్రమతో డాండ్రఫ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఓ చిన్న గిన్నెలో మూడింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలి. జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఓ గంట తరువాత మైల్డ్ షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డాండ్రఫ్ సమస్య పోవడమే కాకుండా కేశాలు అందంగా మారుతాయి. 


బాదం నూనెలో మిక్స్ చేయకుండా కేవలం నిమ్మరసంతో కూడా డాండ్రఫ్ సమస్యను అరికట్టవచ్చు. నిమ్మరసాన్ని చేతి వేళ్లతో తలంతా పట్టేలా రాసుకోవాలి. ఓ రెండు మూడు గంటలుంచి ఆ తరువాత తలస్నానం చేస్తే డాండ్రఫ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.


Also read: Vegetables Storage Tips: ఆ 4 కూరగాయల్ని ఫ్రిజ్‌లో ఉంచకూడదా, ఉంచితే ఏమౌతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook