Hair Care Tips: అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టుకు ఏం చేయాలి
Hair Care Tips: సీజన్ ఏదైనా సరే..సరైన జుట్టుకు సరైన సంరక్షణ అవసరం. అందులో వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలనేది తెలుసుకుందాం..
Hair Care Tips: సీజన్ ఏదైనా సరే..సరైన జుట్టుకు సరైన సంరక్షణ అవసరం. అందులో వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో మీ జుట్టును ఎలా సంరక్షించుకోవాలనేది తెలుసుకుందాం..
వేసవి ఎండలు కావచ్చు లేదా వాతావరణంలో మట్టి, దుమ్ము ధూళి కావచ్చు..ఆ ప్రభావం కేవలం చర్మంపైనే కాకుండా..జుట్టుపై కూడా స్పష్టంగా ఉంటుంది. అందుకే జుట్టుకు సరైన సంరక్షణ అవసరమంటున్నారు బ్యూటీ కేర్ నిపుణులు. అదే సమయంలో బయట్నించి ఇంటికి తిరిగొచ్చాక తలలో దురద రావడం ప్రధాన సమస్యగా కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. జుట్టు సంరక్షణకు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
సాధారణంగా ఆఫీసు పనిమీదనో..లేదా మరే ఇతర పనిమీదనో బయటకు వెళ్లినప్పుడు మన జుట్టంతా దుమ్ము ధూళికి ఎక్స్‌పోజ్ అవుతుంటుంది. జుట్టంతా పాడైపోతుంది. దురదతో చిరాగ్గా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఇంటికొచ్చిన వెంటనే ముందు జుట్టుని శుభ్రంగా వాష్ చేయాలి. దీనికోసం ఏదైనా మైల్డ్ షాంపూ వినియోగించాలి. కానీ రోజూ జుట్టు వాష్ చేయకుండా..రోజు విడిచి రోజు వాష్ చేస్తుండాలి.
జుట్టుని ఆరోగ్యంగా ఉంచేందుకు హెయిర్ మాస్క్ పెట్టుకోవాలి. హెయిల్ మాస్క్ అనేది జుట్టుకు చాలా అవసరం. జుట్టుని హైడ్రేట్‌గా ఉంచుతుంది. దాంతోపాటు జుట్టు ఎండిపోకుండా కాపాడుతుంది. జుట్టు సంరక్షణకు అల్లోవెరా, పెరుగు, గుడ్లు మిశ్రమం చాలా మంచిది. బయట్నించి లేదా ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన తరువాత కచ్చితంగా ఒకసారి దువ్వుకుంటే జుట్టు మృదువుగా, చిగుళ్లు పడకుండా ఉంటుంది. మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. జుట్టు మృదువుగా, పటిష్టంగా ఉండేందుకు ప్రోటీన్లు, విటమిన్లు , మినరల్స్ చాలా అవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి