ప్రతి అమ్మాయికి కేశాలు మృదువుగా, బలంగా, పొడుగ్గా ఉండాలనే కోరిక ఉంటుంది. చలికాలంలో కేశాల సమస్య ఎక్కువై..ఇబ్బందిగా మారుతుంటుంది. చలికాలంలో కేశ సంరక్షణకు ఏం చేయాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేశ సంరక్షణకు అల్లోవెరా మంచి పరిష్కారం. అల్లోవెరా రాయడం వల్ల జుట్టు బలంగా, దట్టంగా, మృదువుగా, పొడుగ్గా మారుతుంది. అల్లోవెరాలో ఉండే పోషక గుణాల వల్ల జుట్టు బలంగా మారుతుంది. అల్లోవెరా జెల్ కేశాలకు రాయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇంట్లోనే అల్లోవెరా జెల్ తీసి జుట్టుకు రాసుకోవాలి. అల్లోవెరా జ్యూస్ కూడా కేశాలకు లాభదాయకం. అల్లోవెరా జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పోషకాలు చేరి..కేశాలు మరింత పటిష్టంగా మారుతాయి.


అల్లోవెరా ఉపయోగాలు


అల్లోవెరా ఉపయోగించడం వల్ల కేశాలకు చాలా లాభాలున్నాయి. చలికాలంలో ఎదురయ్యే జుట్టు సమస్యలు తొలగిపోతాయి. హెయిర్ ఫాల్, డేండ్రఫ్ వంటి సమస్యలు నిర్మూలించవచ్చు. అల్లోవెరాలో ఉండే పోషకాలు కేశాల్ని పటిష్టంగా చేస్తాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, ఎమైనా యాసిడ్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి12 కేశాలకు చాలా మంచిది. 


అల్లోవెరా కేశాలకు బలం చేకూర్చి..హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. ఇదొక సహజసిద్ధమైంది కావడంతో జుట్టుకు రాసి మసాజ్ చేస్తే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అల్లోవెరాలో ఉండే ఎంజైమ్..జుట్టును లోపల్నించి  నరిష్ చేస్తుంది. ఫలితంగా కేశాలు సిల్కీగా, షైనీగా మారుతాయి. అల్లోవెరా..ఎక్స్ట్రా సీబమ్‌ను తొలగిస్తుంది. ఫలితంగా జుట్టు ఆయిల్ ఫ్రీగా అవుతుంది.


అల్లోవెరా రాయడం వల్ల డేండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా స్కాల్ప్‌లో ఉండే దురద సమస్య పోతుంది. అల్లోవెరా రాయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది.


Also read: Seed Mix Benefits: రోజూ 1-2 స్పూన్స్ తీసుకుంటే చాలు..కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం అన్నీ మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook