Hair Care Tips At Home: వాతావరణంలో మార్పులు రావడం వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చిన్న వయసులోనే బట్టతలకు సమస్యకు గురవుతున్నారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆహారాలను మానుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సి ఉంటుంది:


>>జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు మెర్క్యురీ చేపలను తినడం వల్ల కూడా చాలా రకాల సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పలు మూలకాలు చాలా రకాల జుట్టు సమస్యలకు దారి తీసే ఛాన్స్‌ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి చేపలను ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచిది.


>>ప్రతి రోజూ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం ప్రారంభమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆల్కహాల్ తీసుకోవడం మానుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


>>జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్ల జుట్టు రాలడమేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా మంచి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


>>జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు గుడ్డులోని తెల్లసొనను తినడం మంచిది కాదని నిణులు చెబుతున్నారు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల శరీరంలో బయోటిన్ లోపం ఏర్పడి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినకపోవడం చాలా మంచిది.


>>అతిగా స్వీట్లు తినడం వల్ల కూడా జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయంతో పాటు మధుమేహం సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు.


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!


Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook