Hair Care Tips For Long Hair: పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే ప్రతి రోజు చాలా మంది భోజనాన్ని చివరిలో పెరుగుతో ముగిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికే కాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో జుట్టును ఆరోగ్యంగా చేసే చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని మాస్క్‌లా వినియోగించడం వల్ల చాలా తీవ్ర జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగులో ఈ పదార్థాలు అప్లై చేసి వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు పొడవగా పెరగడానికి పెరుగును ఇలా వినియోగించండి:
నిమ్మకాయ:

పెరుగులో నిమ్మకాయ రసాన్ని కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలు దూరమవుతాయి. వెంట్రుకలు బలంగా, దృఢంగా చేసుకోవడానికి ప్రతి రోజు కప్పు పెరుగును తీసుకుని అందులో  6 చుక్కల కొబ్బరి నూనె వేసి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా జుట్టుకు అప్లై చేసి 20నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 


గుడ్లు:
పెరుగులో గుడ్లను వేసి బాగా మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత జుట్టుకు 20 నిమిషాల పాటు మిశ్రమాన్ని అలానే ఉంచాల్సి ఉంటుంది. అంత ఆరిపోయిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


అరటిపండు:
పెరుగులో అరటిపండు మిశ్రమాన్ని కలిపి అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. దీని కోసం మీరు ఒక కప్పు పెరుగును తీసుకుని అందులో అర కప్పు అరటి పండు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్‌ చేసుకుని జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


గుడ్లు మిత్‌ తేనె:
గుడ్డులోని పచ్చ సొన పక్కన పెట్టి అందులో తేనె కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 10 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే చాలు జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. 


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook