How To Make Apple Cider Vinegar Hair Water: వాతావరణంలో దుమ్ము, ధూళి పెరగడం కారణంగా చాలా మందిలో చర్మ, జుట్టు సమస్యలు సులభంగా వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మందిలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ప్రతి రోజు యాపిల్ వెనిగర్ హెయిర్ వాటర్ వినియోగించడం వల్ల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ వంటి అనేక మూలకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని వాడడం వల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే జుట్టు సమస్యలను దూరం చేసే యాపిల్ వెనిగర్ హెయిర్ వాటర్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ హెయిర్ వాటర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
 ✴ ½ కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ 
 ✴ 2 కప్పులు నీరు


Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  


యాపిల్ సైడర్ వెనిగర్‌ వాటర్ తయారీ పద్ధతి:
✴ ఈ హెయిర్‌ వాటర్‌ తయారు చేసుకోవడానికి ముందుగా స్ప్రే బాటిల్ తీసుకోవాలి.
✴ బాటిల్‌లో అర కప్పు ఆపిల్ వెనిగర్, 2 కప్పుల నీరు నీటిని పోసుకోవాలి.
✴ ఇలా రెండింటిని బాగా మిక్స్‌ చేసుకోవాలి.
✴ అంతే సులభంగా యాపిల్ సైడర్ వెనిగర్‌ హెయిర్‌ వాటర్ తయారైనట్లే..


వినియోగించే పద్ధతి:
✴ యాపిల్ వెనిగర్ హెయిర్ వాటర్‌ను వినియోగించడానికి ముందు జుట్టును బాగా శుభ్రం చేసుకోవాలి.
✴ పైన తయారు చేసుకున్న స్ప్రేని జుట్టుకు అప్లై చేయాలి.
✴ ఇలా అప్లై చేసిన 25 నుంచి 30 నిమిషాల పాటు జుట్టును ఆరనివ్వాలి. 
✴ ఆ తర్వాత జుట్టును బాగా శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Bhuma Akhila Priya Reddy: భూమా అఖిలప్రియకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి


IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates