Reason Of Hair Loss: హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ పుడ్ కు దూరంగా ఉండండి చాలు!
Reason Of Hair Loss: మీ జుట్టు తరచూ రాలుతోందా? మిమ్మల్ని బట్టతల సమస్య వేధిస్తుందా? అయితే ఇది మీ కోసమే.
Reason Of Hair Loss: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జట్టు రాలడం సాధారణ సమస్యగా మారిపోయింది. మన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ప్రధానంగా హెయిర్ ఫాల్ (Hair fall)కు కారణం. జుట్టు రాలడాన్ని తొలినాళ్లలోనే గుర్తిస్తే.. సులువుగా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఏ నూనెనో లేదా మెడిషన్ ను వాడటం కాదు. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలు. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు రాలడానికి కారణమయ్యే ఆహార పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడానికి కారణమయ్యే పుడ్:
>> జంక్ ఫుడ్ ((Junk Food) మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ పుడ్ కారణంగా మీ స్కాల్ప్ యొక్క రంధ్రాలు మూసుకుపోతాయి. దీని కారణంగా మీ జట్టు రాలడం మెుదలవుతుంది.
>> సముద్రంలో దొరికే చేపలను తింటే బట్టతల వస్తుంది. ట్యూనా, షార్క్ లేదా స్వోర్డ్ ఫిష్ వంటి సముద్ర చేపలలో పాదరసం ఉంటుంది. ఈ పాదరసం వల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది.
>> షుగర్ కూడా మీ బట్టతలకి కారణం కావచ్చు. అందుకే దీని వాడకం తగ్గిస్తే మంచిది.
>> మైదా, బ్రెడ్ లాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మీ జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది.
>> ఆల్కహాల్ వినియోగం కూడా మీ హెయిర్ ఫాల్ కు కారణం కావచ్చు. జుట్టులో కెరొటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మీ జట్టు బలంగా ఉండటానికి కారణం ఈ ప్రోటీనే. మద్యం తీసుకోవడం వల్ల ఇది ప్రభావితమై...జుట్టు యెుక్క నాణ్యత క్షీణించి.. రాలడానికి కారమవుతుంది.
>> స్వీటెనర్ కూడా జుట్టును డ్యామేజ్ చేస్తుందని ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది.
Also read: Long Hair Tips: జుట్టు పొడవుగా పెరగాలని కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.