Hair Color Fading: ప్రస్తుతం చాలా మంది జుట్టును స్టైలిష్, ట్రెండీ లుక్ తీసుకోచ్చేందుకు హెయిర్ కలర్‌ని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం పార్లర్‌లో వేల రూపాయలతో కలిగిన రంగులను వేసుకుంటారు. అయితే ఇలా తరచుగా కలర్స్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయని సౌదర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా రసాయనాలతో కూడిన రంగులను వినియోగించడం వల్ల జుట్టు చిన్న వయసులోనే తెల్లబడుతోంది. అయితే కలర్స్ వేసిన జుట్టు చెక్కు చెదరకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే దీని కోసం పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు రంగు నెరిపోతుందా?:
ప్రస్తుతం చాలా మంది పలు రకాల పొరపాట్లతో జుట్టుకు రంగులు వేస్తున్నారు. దీని కారణంగా రంగు మారడం మొదలవుతుంది. అయితే ఇలా జుట్టు కలర్‌ మారకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చిన్న చిన్న చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది.


తప్పుడు షాంపూని అప్లై చేయండి:
చాలా మంది జుట్టు రంగును అప్లై చేసిన తర్వాత తరచుగా రసాయనాలు అధికంగా ఉండే షాంపులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల జుట్టుపై అప్లై చేసిన కలర్ మరింత హినంగా తయారువుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టు కలర్స్‌ను వాడేవారు తప్పకుండా రసాయనాలు అధికంగా ఉండే షాంపులను వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


వేడి నీళ్లతో జుట్టు కడుక్కోవడం:
చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం తప్పనిసరిగా చేస్తూ ఉంటారు.  అయితే కొంతమంది సాధారణ ఉష్ణోగ్రతలో కూడా వేడి నీటి స్నానం చేయడానికి ఇష్టపడతారు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు బలహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా రంగు కూడా సులభం తగ్గుతుంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించి వేడి నీటితో స్నానం చేయడం మానుకోండి.


హీట్ ప్రొటెక్టర్, టూల్స్:
హీట్ ప్రొటెక్టర్స్‌ను వినియోగించడం వల్ల కూడా జుట్టు సహజ రంగు కూడా పోతుందని నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా ఇంట్లో హెయిర్ డ్రైయర్‌లు, హెయిర్ స్ట్రెయిట్‌నెర్‌లు వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొందరిలో జుట్టు కూడా రాలిపోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి