Hair Fall: ఇలా షాంపూను వినియోగించడం వల్లే జుట్టు రాలడం సమస్యలు వస్తున్నాయి!
Common Shampoo Uses Mistakes: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా షాంపూను ఈ పద్ధతుల్లో వినియోగించడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బట్టతల సమస్యలు కూడా రావొచ్చు.
Common Shampoo Uses Mistakes: ప్రస్తుతం జుట్టును శుభ్రం చేయడానికి మార్కెట్‌లోని రసాయనాలతో కూడిన షాంపూ ఉపయోగిస్తారు. వీటిని వినియోగించడం వల్ల జుట్టులో ఉన్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది. హెయిర్ కేర్ ప్రోడక్ట్ వినియోగించే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా షాంపూలను వినియోగించే క్రమంలో ఈ కింది చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ చిన్న చిన్న తప్పులు చేయకపోవడం మానుకోవాలి. లేదంటే తీవ్ర జుట్టు సమస్యలు వస్తాయని సౌంద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే షాంపూను వినియోగించే క్రమంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు:
అవసరానికి మించి షాంపూను వినియోగించవద్దు:
జుట్టుకు షాంపూను వినియోగించిన తర్వాత ఫోమ్ వస్తుంది. అయితే ఈ క్రమంలో తప్పకుండా జుట్టు మొత్తం ఫోమ్‌ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ప్రస్తుతం చాలా మంది షాంపూను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ షాంపూలను వినియోగించవద్దు:
జుట్టును బట్టి షాంపూలను వినియోగించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర జుట్టు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికీ తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్నవారు అతిగా రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించకపోవడం చాలా మంచిది.
షాంపూతో ఇలా తల స్నానం చేయోద్దు:
ప్రస్తుతం షాంపూతో తల స్నానం చేసే క్రమంలో వేడి నీటిని వినియోగిస్తున్నారు. ఇలా వేడి నీటిని వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జుట్టులో క్యూటికల్స్ దెబ్బ తిని, జుట్టు రాలడం సమస్యలు పెరుగుతాయి. కాబట్టి షాంపూతో తల స్నానం చేసేవారు తప్పకుండా గోరు వెచ్చని నీటిని వినియోగించాల్సి ఉంటుంది.
జుట్టును అతిగా రుద్దుతున్నారా?:
జుట్టుకు షాంపూ రాసేటప్పుడు అతిగా వెంట్రుకలను రుద్దుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా తీవ్ర జుట్టు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరిలో స్కాల్ప్ దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అతిగా షాంపూతో జుట్టును, స్కాల్ప్‌ను రుద్దడం మానుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి