Anti Hair Fall Tips: ఈ అలవాట్లు ఉంటే మాత్రం మీ జుట్టు గోవిందో.. గోవిందా!
Anti Hair Fall Tips in Telugu: జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బట్టతల సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉందని నిపుణుల చెబుతున్నారు.
Anti Hair Fall Tips in Telugu: ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలా మందిలో తీవ్ర జుట్టు రాలడం సమస్యలు వస్తున్నాయి. కాలుష్యం, జన్యుపరమైన కారణాలు, టెన్షన్ కారణంగా కూడా చాలా మందిలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్రమంగా జుట్టు రాలిపోయేవారిలో బట్టతల సమస్య కూడా వస్తోంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సకాలంలో పలు చిట్కాలు పాటిస్తే మంచిది. లేకపోతే బట్టతలకు దారి తీసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
జుట్టుకు హానికరమైన ఆహారాలు ఇవే:
డైట్ సోడా:
ప్రస్తుతం చాలా మంది స్ట్రీట్ ఫుడ్స్ తీసుకునే క్రమంలో డైట్ సోడాలను తీసుకుంటున్నారు. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా జుట్టు రాలిపోయే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ఈ డైట్ సోడా కలిగిన డ్రిక్స్ తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్వీట్ ఫుడ్స్:
చక్కెర పరిమాణాలు అధికంగా ఉండే పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి..జుట్టుపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు అతిగా స్వీట్స్ తినడం వల్ల బట్టతల సమస్యలు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బట్టతల సమస్యలు రాకుండా ఉండడానికి వీలైనంత వరకు చక్కెర పదార్థాలకు దూరంగా ఉండడాల్సి ఉంటుంది.
ఆల్కహాల్:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీనికి అలవాటు పడితే.. శరీరంలో కాలేయంతో సహా అనేక అవయవాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రతి రోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రోటీన్ సంశ్లేషణను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీంతో జుట్టు రాలిపోయి..బట్టతల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి