Hair Fall Control Oil: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చిన్న వయసులోనే జుట్టు రాలడం, బట్టతల సమస్యలతో బాధపడుతున్నారు. కొందరిలో టెన్షన్, అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి బట్ట తల సమస్యలతో బాధపడేవారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ తీసుకునే డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆయుర్వేద గుణాలు కలిగిన మూలికలను వినియోగించడం వల్ల కూడా సులభంగా బట్టతల సమస్య ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా జుట్టుకు బ్రహ్మి ఆకులను వినియోగిస్తే తర్వగా మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రహ్మి ఆకుల ప్రయోజనాలు:
బ్రహ్మి ఆకు నూనెకు కావాల్సిన పదార్థాలు:


  1. 50 గ్రాముల బ్రహ్మీ ఆకులు 

  2. 1 లీటర్‌ నువ్వుల నూనె

  3. 1 లీటర్‌ ఉసిరికాయ రసం

  4. 2 గ్రాముల గసగసాలు 

  5. 10 గ్రాముల కర్పూరం

  6. 2 గ్రాముల గంధం 


Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?


నూనెను ఇలా తయారు చేయండి:


  • ఈ నూనెను తయారు చేయడానికి ముందుగా నువ్వుల నూనెను తీసుకోవాల్సి ఉంటుంది.

  • నూనెను ఒక పాత్రలో వేసి అందులో బ్రహ్మీ ఆకులు, గసగసాలు, గంధం కలిపి సన్నని మంట మీద వేడి చేయాలి.

  • ఇలా కొద్ది సేపు ఉడికిన తర్వాత అందులో ఉసిరి రసాన్ని కలపండి.

  • ఈ నూనెను చల్లార్చి పక్కన పెట్టుకోవాలి.

  • చల్లారిన తర్వాత కాటన్ క్లాత్‌తో నూనెను ఫిల్టర్ చేయాలి.

  • దీన్ని గాజు సీసాలో భద్రపరుచుకోండి.

  • అంతే సులభంగా బ్రహ్మి ఆకుల నూనె తయారైనట్లే.


బ్రహ్మి నూనె ప్రయోజనాలు:
హెయిర్ ఫాల్‌ తగ్గిస్తుంది:

బ్రహ్మి నూనెలో ఉండే గుణాలు స్కాల్ప్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా సులభంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బ్రాహ్మీ-ఆమ్లా ఆయిల్ వినియోగించాల్సి ఉంటుంది. 


చుండ్రు సమస్యలకు చెక్‌:
ప్రస్తుతం చాలా మందిలో చుడ్రు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బ్రహ్మీ-ఉసిరి నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చుండ్రు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దురదను కూడా నియంత్రిస్తుంది. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook